కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్పర్సన్ సోనియాగాంధీ (Sonia Gandhi) అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆమెను ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం ఉదయం ఆమెను ఆసుపత్రికి తరలించారు. వైద్యుల బృందం ఆమెను పర్యవేక్షిస్తోంది. అయితే సోనియాగాంధీ ఆరోగ్యం గురించి కాంగ్రెస్ పార్టీ ఇంకా అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
Read also: South Eastern Railway: రైల్వేలో 54 స్పోర్ట్స్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల
అధిక పవర్ ఫుల్ లేడీ
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, రాజ్యసభ ఎంపీ సోనియాగాంధీ (Sonia Gandhi) గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో గెలిచింది. దీంతో ఆమె పార్టీ అధ్యక్షురాలిగా దేశప్రధాని మన్మోహన్ సింగ్ కంటే అధిక పవర్ ఫుల్ లేడీగా పరిపాలించారు.

మన్మోహన్ సింగ్ నామమాత్రపు ప్రధాని అని, అంతా ఆమే దేశాన్ని నడిపిందని అప్పట్లో వార్తలు వచ్చేవి. అయితే 2017లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాజీనామా చేసి, ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. గతంలో ఆమె ఆరోగ్యసమస్యలతో బాధపడి, అమెరికాలో ప్రత్యేక చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: