సోషల్ మీడియాతో పిల్లల భవిత అంధకారంలోకి కూరుకునిపోతున్నది. పొద్దస్తమానం వారు సెల్ ఫోన్లకే పరిమితమై, శారీరక, మానసిక సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. పైగా సోషల్ మీడియాలో వారు చూడకూడనివి చూస్తూ, లేతవయసులోనే చేయకూడని పనులను చేస్తున్నారు. వారికి ఏదిమంచి, ఏది చెడునో తెలుసుకోలేని స్థితిలో ఉంటారు. ఇలాంటి వారికి కట్టడి తప్పనిసరి అవసరమే.
Read Also: AP Short Film: ఎపి షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోస్టర్ ఆవిష్కరణ
సోషల్ మీడియా (Social media) అనేది రెండువైపులా పదునైన కత్తిలాంటిది. దీనివల్ల మంచికంటే చెడునే ఎక్కువగా జరుగుతున్నది. సోషల్ మీడియా ద్వారానే ఉగ్రకార్యక్రమాలు సైతం సాగుతున్నాయి అంటే ప్రజలు దీన్ని సమాజపతనానికి ఎంతగా వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. దీంతో పిల్లలకు సోషల్ మీడియాను దూరం చేయాలనే ఒత్తిడి ప్రభుత్వాలపై పెరిగిపోతున్నది. ఈ చెడుపరిణామాల వల్ల ఇప్పటికే కొన్ని దేశాలు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాయి.

ఆస్ట్రేలియా, సింగపూర్ లలో నిషేధం
ఆస్ట్రేలియా, సింగపూర్ తో పాటు తాజాగా మలేషియా కూడా 16ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ ను నిషేధించింది. 2026 నుంచి 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలు తెరవకుండా నిషేధం విధించాలని మలేషియా ప్రభుత్వం ఆలోచిస్తోంది. సైబర్ బెదిరింపులు, సైబర్ మోసాలు, లైంగిక వేధింపుల వంటి ఆన్లైన్ హాని నుంచి యువతను రక్షించడం ప్రధాన లక్ష్యమని సంబంధింత వర్గాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాలు ఇప్పటికే అమల చేస్తున్న విధానాలను మలేషియా అధ్యయనం చేస్తోంది. ఇక వారి వయస్సును ధృవీకరించేందుకు ఐడీకార్డులు, పాస్ పోర్ట్ల ద్వారా ఎలక్ట్రానిక్ తనిఖీలను ఉపయోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు.
ఆన్ లైన్ (Online) దాడుల నుంచి యువతను రక్షించేందుకే తాము ఈ చ్యలు తీసుకుంటున్నామని మలేషియా కమ్యూనికేషన్ మంత్రి ఫాహ్మి ఫడ్జిల్ చెప్పారు. ఆన్ లైన్ ప్రపంచం వేగంగా, విస్తృతంగా, చౌకగా ఉండటమే కాకుండా పిల్లలు, వారి కుటుంబాలకు సురక్షితంగా ఉండాలని తాము కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి నియంత్రణ సంస్థలు, తల్లిదండ్రులు అందరూ తమ పాత్ర పోషించారని ఆయన కోరారు. దీనిపై ఆ దేశ ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోంది.
మరి భారత్ పరిస్థితి?
మలేషియా (Malaysia) చేపట్టిన చర్యలు తర్వాత మిగతా దేశాలు కూడా దీనిపై ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అమెరికా, భారత్ వంటి దేశాలు కూడా పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల పిల్లలు, యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారిపై చెడు ప్రభావం చాలా ఉంటుందని అంటున్నారు. 8-12 ఏళ్ల పిల్లలు కంటెంట్ నాణ్యతను గుర్తించలేకపోవడంతో అనుచితమైన ఫొటోలు, వైరల్ ఛాలెంజెస్, సైబర్ బుల్లింగ్ కు గురవుతారు. ఇది ఆత్మహత్యా ఆలోచనలు, సార్కాజం, ఎడిహెచ్ డి వంటి సమస్యలకు దారితీస్తుంది. భారతదేశంలో 2021 ఎన్ సిపిసిఆర్ స్టడీ ప్రకారం, 13ఏళ్లు పూర్తి కాకముందే 37 శాతం పదేళ్ల పిల్లలు ఫేస్ బుక్ లో, 24 శాతం ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు.
అధిక ఉపయోగం వల్ల సెల్ఫ్-ఈస్టీమ్ తగ్గి, ఫిజికల్ యాక్టివిటీ తగ్గుతుంది. వీటివల్ల నిద్రలేమి, మతిమరువు, ఒత్తిడి పెరగడం, డిప్రెషన్ వంటి సమస్యలు పెరుగుతున్నాయని అధ్యయనాల్లో తేలింది. కావున భారతదేశంలో కూడా పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: