హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్(Justice PC Ghoush) సమర్పించిన పూర్తి నివేదికను ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు(Ramakrishna)ను మాజీ మంత్రి, బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీశ్ రావు(BRS MLA Harish Rao) కోరారు. శుక్రవారం ఆయన సచివాలయానికి వెళ్లి సిఎస్ రామకృష్ణరావును కలిశారు. జస్టిస్ ఘోష్ ఇచ్చిన 665 పేజీల నివేదిక ప్రతులను ఇవ్వాలని కోరుతూ.. కెసిఆర్, హరీశ్ రావు పేరుతో వేర్వేరు వినతి పత్రాలను అందజేశారు. అనంతరం వినతిపత్రాలు ఇచ్చినట్లు రశీదులు తీసుకున్నారు. హరీష్ రావు విజ్ఞప్తిని పరిశీలించి చెబుతామని సిఎస్ చెప్పినట్లు సమాచారం.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక
ఎంఎల్ఎలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, బండారు లక్ష్మారెడ్డి, ఎంఎల్సి దేశపతి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రతులను అందజేయాలని సీఎస్ ను హరీశ్ రావు కోరారు.

పూర్తిస్థాయి నివేదికను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకుండా.. కేవలం 60 పేజీలతో కూడిన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదికపై పలు అనుమా నాలు ఉన్నాయని, ఇది ఘోష్ రిపోర్టా.. కాంగ్రెస్ రిపోర్టా..? అని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నలు సంధిస్తున్న సంగతి తెలిసిందే. 665 పేజీల నివేదికను విడుదల చేయాలని బీఆర్ ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్ట్పై సుప్రీంకోర్టుకు వెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ కీలక నేత, నీటి పారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు.
రాష్ట్రానికి గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్ట్
ఢిల్లీలో న్యాయ నిపుణులను ఆయన కలవ నున్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project) విషయంలో న్యాయ పరంగా ఎలా ముందుకు వెళ్లాలో చర్చించనున్నారు. పారీశ్రావు ఇప్పటికే పలుమార్లు కేసీఆర్తో ఈ విషయంపై చర్చలు జరిపారు. రెండు రోజుల క్రితం హరీశ్రావు కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి గుండెకాయ అని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కుప్పకూలిం దంటూ కాంగ్రెస్ నేతలు బోగస్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆ ప్రాజెక్ట్ వల్ల పోయిన సారి లక్షల ఎకరాల్లో వంటలు పండాయని తెలిపారు. కాళేశ్వరం మూడు బ్యారేజీల్లో ఒక బ్యారేజీలో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అలాంటప్పుడు కాళేశ్వరం మొత్తం కూలిందని ఎలా చెప్తారని ప్రశ్నించారు.
హరీష్ రావు జీవిత చరిత్ర
తన్నీరు హరీశ్ రావు (జ. జూన్ 3, 1972) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడు. భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున సిద్దిపేట శాసనసభ నియోజకవర్గం శాసనసభ్యులుగా ఉన్నారు. 2019 సెప్టెంబరు 8 నుండి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
హరీష్ రావు రాజకీయా జీవితం
తెలంగాణ కోసం రాజీనామా చేసి సిద్దిపేట శాసన సభ స్థానానికి 2004 అక్టోబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి 24827 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 58935 ఓట్లతో రికార్డు స్థాయి మెజార్టీతో గెలుపొందాడు
Read hindi news: hindi.vaartha.com
Read Also :