కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఇటీవల మెటా సంస్థపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణం — ప్రముఖ సినీనటి బి. సరోజాదేవి మృతిపై సీఎంఓ (CMO) విడుదల చేసిన కన్నడ సంతాప సందేశాన్ని, మెటా ఫేస్‌బుక్ (Meta Facebook) ఆంగ్లంలో తప్పుడు విధంగా అనువదించడమే. ఆ అనువాదం సరిగ్గా కాకపోవడంతో సీఎం తీవ్రంగా స్పందించారు. ఇటువంటి తప్పిదాలు ప్రజల్లో గందరగోళాన్ని కలిగించే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.

మెటా కంపెనీ స్పందన: “క్షమాపణలు తెలుపుతున్నాం”
ఈ వివాదానికి సంబంధించి తాజాగా మెటా ప్రతినిధులు స్పందించారు. అనువాదంలో ఏఐ టూల్ మిషన్ తప్పిదం వల్ల ఇలా జరిగిందని సంస్థ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. కచ్చితమైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపింది. ఏఐ సాంకేతికతను మెరుగుపరచుకునే ప్రాసెస్‌లో ఉన్నామని, ఇందులో భాగంగానే తప్పిదం జరిగిందని మెటా వివరించింది.
అసలు ఎం జరిగింది?
ప్రముఖ నటి బి. సరోజాదేవి మృతి పట్ల సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) తన అధికారిక CMO ఖాతాలో కన్నడ భాషలో సంతాపం తెలిపారు. సీఎం సిద్ధరామయ్య బహుభాషా తార, సీనియర్ నటి బి. సరోజాదేవి పార్థీవదేహానికి కడసారి నివాళులర్పించారని అందులో పేర్కొంది. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో తప్పుగా అనువదించింది. దీంతో ప్రజలతోపాటు ముఖ్యమంత్రి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి చాలా ప్రమాదకరమని సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మెటా కంపెనీ స్పందిస్తూ సీఎంకు సారీ చెప్పింది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Bandi Sanjay: రెండు రాష్ట్రాల జల వివాదాల పై ఎన్డీయే ప్రభుత్వ తొలివిజయం: కేంద్రమంత్రి