కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిత్యం ఏదో ఒక సంచలన వార్తలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) 24 హత్యలు చేశారని రాష్ట్ర హోంమంత్రి డా.జి. పరమేశ్వర్ మహేష్ శెట్టి తిమరోడి చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వార్త పెనుతుఫానును రేపుతున్నది. ఆయన వ్యాఖ్యలను ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. మహేష్ శెట్టిపై కేసు (Case against Mahesh Shetty) నమోదు చేసి, అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పరువు నష్టం ఆరోపణలపై బీఎన్ఎస్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

మహేష్ శెట్టిపై చట్టపరమైన చర్యలు: డీకే శివకుమార్
ఈ వ్యవహారంపై కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ (DK Sivakumar) స్పందించారు. మహేష్ శెట్టిపై చట్టపర్యమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. గత కొంతకాలంగా మహేష్ ఇలాంటి వివాదాస్పద ప్రకటనలు చేస్తున్నాడని, గతంలో కాంగ్రెస్ కీలక నేతలపై కూడా ఇలాంటి ఆరోపణలే చేశారని డీకే శివకుమార్ మండిపడ్డారు. ఉన్నతమైన పదవుల్లో ఉంటూ ఇలాంటి నిరాధార ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డికే శివకుమార్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: