సామాజిక సర్వే (కుల గణన)పై ఇన్ఫోసిస్ ఫౌండర్ ఎన్.ఆర్. నారాయణమూర్తి(N.R. Narayana Murthy) మరియు ఆయన భార్య, రచయిత్రి సుధా మూర్తి చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల గణనను నిలిపివేయాలని, ఇది సమాజాన్ని విభజించడానికి దారితీస్తుందని నారాయణమూర్తి దంపతులు ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం స్పందించారు.
Read Also: India Post: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ
‘వారికి అర్థం కాకపోతే నేనేం చేయాలి?’
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Chief Minister Siddaramaiah) విలేకరులతో మాట్లాడుతూ, “ఇది వెనుకబడిన కులాల సర్వే కాదని మేము ఇప్పటికే 20 సార్లు చెప్పాం. వారికి (నారాయణమూర్తి దంపతులకు) అర్థం కాకపోతే నేను ఏం చేయాలి. ఇన్ఫోసిస్(Infosys) సంస్థ ఉందని వారికి అన్నీ తెలుసనుకుంటున్నారా? ఇది పూర్తిగా పాపులేషన్ సర్వే మాత్రమే. మరి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సర్వేపై వారు ఏమంటారు?” అని ప్రశ్నించారు. ఈ సర్వే ప్రజల ఆర్థిక, సామాజిక స్థితిగతులను తెలుసుకోవడానికి చేపట్టిందే తప్ప, కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు.

మద్దతుపై బలవంతం లేదు: డీకే శివకుమార్
మరోవైపు, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఈ విషయంపై స్పందిస్తూ, సర్వేకు మద్దతు ఇవ్వాలని తాము ఎవరినీ బలవంతం చేయమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ సర్వేను నిర్వహించడానికి ముందుకు వెళుతుందని ఆయన తెలిపారు.
- సామాజిక సర్వేను సిద్ధరామయ్య దేనిగా అభివర్ణించారు?
- ఇది కేవలం ‘పాపులేషన్ సర్వే’ మాత్రమేనని, కులాల మధ్య విభేదం కోసం కాదని ఆయన అభివర్ణించారు.
- ఈ సర్వేకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం బలవంతం చేస్తుందా?
- లేదు, సర్వేకు మద్దతుపై ఎవరినీ బలవంతం చేయమని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: