అంతరిక్షం నుంచి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన యాక్సియం-4 మిషన్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌లో భాగంగా ప్రయాణించిన భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) తిరిగి భూమిని చేరిన విషయం దేశం మొత్తాన్ని గర్వపెట్టింది. ముఖ్యంగా మోదీ ట్వీట్ చేయడం, శుభాంశు కృషిని పొగడటం విశేషంగా నిలిచింది.

శుభాంశు పై గర్వంగా ఉంది – మోదీ
ధైర్యానికి, దేశభక్తికి నిలువెత్తు నిదర్శనం
ప్రధాని మోదీ (Prime Minister Modi) తన అధికారిక “ఎక్స్” (ట్విట్టర్) ఖాతాలో చేసిన వ్యాఖ్యలో, “శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ధైర్యం, అంకితభావం, అతని విజన్ మిలియన్ల మంది భారతీయులకు ప్రేరణగా నిలుస్తుందని” తెలిపారు. అంతరిక్ష ప్రయాణం చేయడం సాహసోపేతమైనదే కాకుండా, మానవ సామర్థ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి భూమికి తిరిగి వచ్చిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాను స్వాగతించే భారత ప్రజల్లో తాను కూడా ఒకడినని ఆయన పేర్కొన్నారు.
సముద్రంలో విజయవంతమైన ల్యాండింగ్
కాలిఫోర్నియా సమీపంలో దూసుకొచ్చిన కాప్సూల్
యాక్సియం-4 మిషన్‌లో భాగంగా అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి బయలుదేరిన వ్యోమనౌక, కాలిఫోర్నియా తీరంలోని పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ మిషన్‌లో మొత్తం నలుగురు వ్యోమగాములు ఉన్నారు. శుభాంశు శుక్లా వారి లలో ఒకడిగా ఉండడం భారత అంతరిక్ష చరిత్రలో ఓ విశేష ఘట్టంగా మారింది.
యాక్సియం-4 అనుభవం ISROకి బలమైన ఆధారంగా
ప్రధాని మోదీ ఈ సందర్భాన్ని భారత తొలి మానవ సహిత అంతరిక్ష ప్రోగ్రామ్ ‘గగన్‌యాన్’కు ఒక కీలక అడుగుగా అభివర్ణించారు. “ఈ మిషన్ భారత అంతరిక్ష రంగానికి ప్రాచుర్యం తెచ్చింది. ISRO భవిష్యత్ ప్రాజెక్టులకు ఇది ప్రేరణగా నిలుస్తుంది,” అని మోదీ అన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Shubhanshu Shukla : అంతరిక్షం నుంచి ల్యాండ్ అయిన శుభాంశు శుక్లా!