కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan) ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో బీమా సంస్థల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని ఫసల్ బీమా యోజన (PMFBY) కింద రైతులకు ఇవ్వబడుతున్న పరిహారం మొత్తాలపై సమీక్షిస్తూ ఆయన మాట్లాడుతూ, కొన్ని బీమా సంస్థలు రైతుల పట్ల అన్యాయం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Haryana Crime: ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై తుపాకీతో దాడి

“రైతులు తమ కష్టార్జిత ధనంతో బీమా ప్రీమియం చెల్లిస్తారు, కానీ పంట నష్టం జరిగినప్పుడు వారికి కేవలం రూ.1, రూ.5 లేదా రూ.21 మాత్రమే పరిహారంగా ఇవ్వడం ఎంత న్యాయమంటారు?” అంటూ ప్రశ్నించారు. అది రైతులను, పథకాన్ని హేళన చేయడమే అవుతుందని మండిపడ్డారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం అనుమతించబోదని పేర్కొన్నారు (Shivraj Singh Chauhan).
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: