हिन्दी | Epaper

Latest Telugu News : Shashi Tharoor : రాహుల్‌ సమావేశానికి శశిథరూర్‌ డుమ్మా.. ఇది మూడోసారి

Sudha
Latest Telugu News : Shashi Tharoor : రాహుల్‌ సమావేశానికి శశిథరూర్‌ డుమ్మా.. ఇది మూడోసారి

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్‌ (Shashi Tharoor) వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగుతూనే.. ప్రధాని మోదీ, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ, పార్టీ సమావేశాలకు దూరంగా ఉంటూ నిత్యం హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. తాజాగా థరూర్‌ (Shashi Tharoor) మరోసారి వార్తల్లో నిలిచారు.

Read Also : Reliance: కూతురు ఈషా కోసం మెగా IPOకి ప్లాన్ చేస్తున్న ముఖేష్ అంబానీ

Shashi Tharoor
Shashi Tharoor

ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నిర్వహించిన పార్టీ సమావేశానికి థరూర్‌ డుమ్మా కొట్టారు. లోక్‌సభ శీతాకాల సమావేశాలు వచ్చే వారం ముగియనున్న నేపథ్యంలో పార్టీ పనితీరును సమీక్షించేందుకు, సభలో అనుసరించాల్సిన వూహాలపై చర్చించేందుకు నేడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ ముఖ్యమైన భేటీకి థరూర్ హాజరు కాలేదు. ప్రస్తుతం తాను కోల్‌కతాలో ఉన్నట్లు థరూర్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. ఇలా పార్టీ కీలక భేటీలకు థరూర్‌ హాజరు కాకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం. నవంబర్ 30న సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశానికి, నవంబర్ 18న ఖర్గే, రాహుల్ నేతృత్వంలో జరిగిన భేటీకి కూడా ఆయన హాజరు కాలేదు.

శశి థరూర్ ఎవరు?

భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడైన ఆయన 2009 నుండి కేరళలోని తిరువనంతపురం నుండి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలో ఐక్యరాజ్యసమితి అండర్ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు మరియు 2006లో సెక్రటరీ జనరల్ పదవికి పోటీ చేసి, రెండవ స్థానంలో నిలిచారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

బోర్డు పరీక్షల్లో ‘చాట్‌జీపీటీ’తో కాపీయింగ్.. 81 మంది సస్పెన్షన్

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

తరుణ్ హత్యతో భగ్గుమన్న ఢిల్లీ.. రంగంలోకి బుల్డోజర్లు

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

యుద్ధంపై కేంద్ర మంత్రి జైశంకర్ ప్రకటన

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

ముంచుకొస్తున్న 1970 చమురు సంక్షోభం..విలవిలలాడుతున్న పలు దేశాలు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

కవితతో సహా 23 మందికి హైకోర్టు నోటీసులు

📢 For Advertisement Booking: 98481 12870