Shashi Tharoor : 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కుమ్మక్కై ‘భారీ క్రిమినల్ మోసం’ చేశాయంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు శశి థరూర్ మద్దతు పలికారు. కర్ణాటకలోని మహదేవపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 1,00,250 ఓట్లు దొంగిలించ బడ్డాయని, బీజేపీకి 1,14,046 ఓట్ల ఆధిక్యంతో బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ సీటును 32,707 ఓట్ల మెజారిటీతో గెలుచుకుందని రాహుల్ ఆరోపించారు. ఈ మోసం ఐదు విధాలుగా జరిగిందని డూప్లికేట్ ఓటర్లు, నకిలీ చిరునామాలు, ఒకే చిరునామాలో బల్క్ ఓటర్లు, చెల్లని ఫోటోలు, ఫారం 6 దుర్వినియోగం ఆయన వివరించారు.
థరూర్ తన ఎక్స్ పోస్ట్‌లో, “ఈ ప్రశ్నలు తీవ్రమైనవి, అన్ని పార్టీలు, ఓటర్ల ప్రయోజనాల దృష్ట్యా పరిష్కరించాలి. మన democracy చాలా విలువైనది, దాని విశ్వసనీయతను మోసం ద్వారా నాశనం కానివ్వకూడదు” అని పేర్కొన్నారు. గతంలో మోదీని పొగడటం, ఎమర్జెన్సీపై విమర్శలతో పార్టీలో వివాదంలో ఉన్న థరూర్ రాహుల్‌కు మద్దతు ఇవ్వడం గమనార్హం.

బీజేపీ ఈ ఆరోపణలను ‘నిరాధారం’గా ఖండించింది. రాహుల్ గాంధీ వరుస ఓటముల నిరాశతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని, ఓటర్లను అవమానించడం ద్వారా కాంగ్రెస్ మరింత తిరస్కరణకు గురవుతుందని పేర్కొంది. ఈసీ కూడా రాహుల్ ఆరోపణలను ‘తప్పుదారి’గా పేర్కొంటూ, ఆయనను రుజువులతో సహా ప్రమాణం చేయమని కోరింది.
మహదేవపురలో కాంగ్రెస్ విశ్లేషణలో 11,965 డూప్లికేట్ ఓటర్లు, 40,009 నకిలీ చిరునామాలు, 33,692 ఫారం 6 దుర్వినియోగ కేసులు గుర్తించినట్లు రాహుల్ తెలిపారు. ఈసీ డేటా, సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వకపోవడం ద్వారా నేరాన్ని కప్పిపుచ్చుతోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ఈ విషయంపై ఆగస్టు 8న బెంగళూరులో ‘వోట్ అధికార్ ర్యాలీ’ నిర్వహించి, ఈసీకి మెమోరాండం సమర్పించనుంది.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :