సుప్రీం కోర్టు(Supreme Cort of India)ఒక కీలక తీర్పులో స్థిరాస్తి (Real Estate) విక్రయాలు సర్వీస్ ట్యాక్స్(Service Tax Verdict) పరిధిలోకి రావని స్పష్టం చేసింది. ఈ తీర్పు ద్వారా రియల్ ఎస్టేట్ రంగానికి గణనీయమైన ఉపశమనం లభించింది.
Read also:Arshdeep Singh: అర్ష్‌దీప్ కొత్త రైడ్‌తో సెన్సేషన్

కేసు వివరాల ప్రకారం, సహారా ఇండియా కంపెనీకి చెందిన ‘ఎలిగెంట్ డెవలపర్స్’ అనే సంస్థ 2002–2005 మధ్య గుజరాత్, హరియాణా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఉన్న భూములను అవుట్‌రైట్ సేల్ (పూర్తి విక్రయం) రూపంలో విక్రయించింది. ఈ లావాదేవీలను “రియల్ ఎస్టేట్ ఏజెంటుగా చేసిన సేవలు”గా పరిగణిస్తూ DGCEI (Directorate General of Central Excise Intelligence) సంస్థపై ₹10.28 కోట్లు సర్వీస్ ట్యాక్స్(Service Tax Verdict) విధిస్తూ నోటీసులు జారీ చేసింది.
కేసు పరిణామాలు మరియు తీర్పు సారాంశం
‘ఎలిగెంట్ డెవలపర్స్’ ఈ నోటీసులను సవాలు చేస్తూ CESTAT (Customs, Excise and Service Tax Appellate Tribunal)లో అప్పీలు దాఖలు చేసింది. CESTAT ఈ ట్యాక్స్ నోటీసులను రద్దు చేస్తూ, “భూముల విక్రయం సేవ కింద పరిగణించలేము” అని తేల్చింది.
తదనంతరం, సర్వీస్ ట్యాక్స్ కమిషనర్ సుప్రీం కోర్టును ఆశ్రయించగా, కోర్టు CESTAT తీర్పును సమర్థించింది.
సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం,
- స్థిరాస్తి విక్రయం అనేది సేవ కాదు, అది వస్తు (property) హస్తాంతరణ.
- అందువల్ల సర్వీస్ ట్యాక్స్ చెల్లింపుకు ఇది అర్హం కాదు.
ఈ తీర్పు భవిష్యత్‌లో ఇలాంటి కేసులపై కూడా మార్గదర్శకంగా నిలవనుంది.
రియల్ ఎస్టేట్ రంగానికి ప్రభావం
ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు, ఇన్వెస్టర్లకు పెద్ద ఊరట లభించింది. సర్వీస్ ట్యాక్స్ విధింపుపై ఉన్న అనిశ్చితి తొలగిపోవడంతో భవిష్యత్ లావాదేవీలు మరింత స్పష్టత పొందనున్నాయి.
సుప్రీం కోర్టు ఏ అంశంపై తీర్పు ఇచ్చింది?
స్థిరాస్తి విక్రయాలు సర్వీస్ ట్యాక్స్ పరిధిలోకి రావు అని.
ఈ కేసులో ఏ సంస్థలు పాలుపంచుకున్నాయి?
‘ఎలిగెంట్ డెవలపర్స్’ (సహారా గ్రూప్ అనుబంధ సంస్థ) మరియు DGCEI.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/