న్యూఢిల్లీ: పంట వ్యర్థాల దహనంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు(Supreme court) తాజాగా విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందుకు పాల్పడిన కొంతమంది రైతులనైనా జైలుకు పంపిస్తేనే మిగతా వారికి గట్టి సందేశం ఇచ్చినట్లవుతుందని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. రైతులు మనకు అన్నం పెడుతున్నారని, అయితే దాని అర్థం పర్యావరణాన్ని పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలని కాదని ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అన్నారు.
అధికారులు, రైతులపై సుప్రీం ప్రశ్నలు
పంట వ్యర్థాలను తగలబెట్టకుండా రైతులకు(farmers) సబ్సిడీలు, వివిధ పరికరాలు అందిస్తున్నట్టు అమికస్ క్యూరీ అపరాజిత సింగ్ కోర్టుకు తెలిపారు. అయితే, ఉపగ్రహాలు ఆయా ప్రాంతాల మీదుగా వెళ్లేటప్పుడు కాకుండా మిగిలిన సమయాల్లో వ్యర్థాలను కాల్చుకోవచ్చని అధికారులు చెప్పినట్టు రైతులు పదేపదే చెబుతున్నారని ఆమె విన్నవించారు. దీనిపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కొందరినైనా జైలుకు(prison) పంపితేనే సరైన సందేశం వెళ్తుందని అభిప్రాయపడింది. రైతులపై జరిమానా విధించే ఆలోచన ఎందుకు చేయడం లేదని కూడా ప్రశ్నించింది. పర్యావరణాన్ని పరిరక్షించాలనే నిజమైన ఉద్దేశమే ఉంటే ఇలాంటి చర్యలకు దూరంగా ఎందుకు ఉండరని నిలదీసింది.

పొల్యూషన్ కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలపై ఆగ్రహం
కొన్ని రాష్ట్రాల్లోని పొల్యూషన్(Pollution) కంట్రోల్ బోర్డుల్లో ఖాళీలు ఉండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. మూడు నెలల్లోగా అన్ని ఖాళీలను భర్తీ చేయాలని సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో శీతాకాలంలో వాయు కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకోవడానికి పంట వ్యర్థాల దహనం ప్రధాన కారణంగా గుర్తించారు. ఈ కాలుష్యాన్ని అరికట్టేందుకు మూడు వారాల్లోగా ప్రణాళికలు సమర్పించాలని కోర్టు సంబంధిత బోర్డులను ఆదేశించింది.
పంట వ్యర్థాల దహనంపై సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది? జ: కొందరినైనా జైలుకు పంపితేనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
ప్ర: ఢిల్లీలో వాయు కాలుష్యానికి ప్రధాన కారణం ఏమిటి? జ: ప్రతి ఏటా శీతాకాలంలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే వాయు కాలుష్యానికి ప్రధాన కారణంగా గుర్తించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: