రైల్వేశాఖ తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో శుభవార్తను అందించింది. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా కేరళ రాజధాని తిరువనంతపురం వరకు అమృత్ భారత్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైలును ఈ నెల 23వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది. సామాన్య, మధ్యతరగతి ప్రజల కోసం దేశవ్యాప్తంగా దశలవారీగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేంద్రం తీసుకొచ్చింది. కొత్త రైలుతో రెండు రాష్ట్రాల ప్రజలకు ప్రయోజనం కలగనుంది.
Read Also: Y S Jagan: యేడాదిన్నర తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రను ప్రారంభిస్తా
కుదుపులు లేని ప్రయాణం
ఈ కొత్త రైలు (నంబర్ 17041/17042) చర్లపల్లి నుండి బయలుదేరి నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, నెల్లూరు మీదుగా ఆంధ్రప్రదేశ్‌లో సాగుతుంది. అనంతరం తమిళనాడులోని కాట్పాడి, సేలం, ఈరోడ్ మీదుగా ప్రయాణించి కేరళలోని పాలక్కాడ్, ఎర్నాకుళం, కొట్టాయం, కొల్లం స్టేషన్ల ద్వారా తిరువనంతపురం చేరుకుంటుంది. సాధారణ వీక్లీ ఎక్స్‌ప్రెస్ షెడ్యూల్‌ను అధికారులు త్వరలోనే ఖరారు చేయనున్నారు.
అమృత్ భారత్ రైలులో 11 జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు, 8 స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. దివ్యాంగుల కోసం అనుకూలమైన 2 సెకండ్ క్లాస్ కోచ్‌లు, ఒక ప్యాంట్రీ కార్ అందుబాటులో ఉంటాయి. ఈ రైలులో రెండు వైపులా ఇంజన్లు ఉండటం వల్ల ప్రయాణ వేగం పెరగడమే కాకుండా.. కుదుపులు లేని ప్రయాణం సాధ్యమవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: