శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రస్తుత మండల యాత్రా సీజన్‌లో స్వామివారిని దర్శించుకున్న యాత్రికుల సంఖ్య ఇప్పటికే 25 లక్షలు దాటింది. గత ఏడాది ఇదే కాలంలో సుమారు 21 లక్షల మంది మాత్రమే దర్శనం చేసుకోగా, ఈసారి నాలుగు లక్షలకుపైగా పెరుగుదల కనిపిస్తోందని అధికారులు తెలిపారు. యాత్ర ప్రారంభ దశలో కొంత రద్దీ కనిపించినప్పటికీ, పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలతో దర్శనాలు సజావుగా కొనసాగుతున్నాయని శబరిమల (sabarimala) చీఫ్ పోలీస్ కోఆర్డినేటర్, ఏడీజీపీ ఎస్. శ్రీజిత్ వెల్లడించారు.
Read also: TV Price: పెరగనున్న టీవీల ధరలు!

The number of Sabarimala pilgrims has crossed 25 lakhs
వేరే రోజుల్లో భక్తులు రావడం వల్లే
వర్చువల్ క్యూ పాసుల్లో కేటాయించిన తేదీలను పాటించకుండా వేరే రోజుల్లో భక్తులు రావడం వల్లే మొదట్లో రద్దీ ఏర్పడిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ సీజన్‌లో వారాంతాలకన్నా పనిదినాల్లోనే భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటోందని తెలిపారు. పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ఈ నెల 27న జరిగే మండల పూజతో దాదాపు రెండు నెలల పాటు సాగే వార్షిక యాత్రలో తొలి దశ ముగియనుందని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: