S. Jaishankar: శ్రీలంక తీరంలో ఇరాన్ (Iran) యుద్ధ నౌక ఐరిస్ డేనా మునిగిపోయిన ఘటనపై కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తొలిసారిగా అధికారికంగా స్పందించారు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనేందుకు ఇరాన్ నౌకలు భారత్‌కు వచ్చాయని జైశంకర్ గుర్తుచేశారు. అయితే, తిరిగి వెళ్లే క్రమంలో ఇరాన్-అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ఈ నౌకలు అనుకోకుండా యుద్ధ ప్రభావానికి గురయ్యాయని, తీవ్రమైన సమస్యలను ఎదుర్కొన్నాయని ఆయన వెల్లడించారు.
Read Also: Iran Israel War: ఇరాన్‌లో లీటర్ పెట్రోల్ కేవలం రూ. 5?

కొచ్చిలో ఐరిస్ లావాన్ నౌకకు ఆశ్రయం
మరోవైపు, ఇరాన్‌కు చెందిన ఐరిస్ లావాన్ నౌకలో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తడంతో భారత తీరంలోని కొచ్చిలో అత్యవసరంగా నిలిపేందుకు (Emergency Docking) ఇరాన్ అధికారులు అనుమతి కోరారు. భారత ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించి, మానవతా దృక్పథంతో మార్చి 1న అనుమతులు మంజూరు చేసింది.
భారత అనుమతితో ఐరిస్ లావాన్ నౌక మార్చి 4న కొచ్చి పోర్టుకు చేరుకుంది. ఈ నౌకలో ఉన్న 183 మంది సిబ్బందికి భారత్ ఆశ్రయం కల్పించిందని, వారికి అవసరమైన అన్ని సదుపాయాలను అందిస్తున్నామని జైశంకర్ స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: