రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తి కావడంతో దేశవ్యాప్తంగా వేడుకల వాతావరణం నెలకొంది. అక్టోబర్ 2, 2025న విజయదశమి సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్ తన శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించింది. ఈ సందర్భంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విజయదశమి వేడుకలు, యువజన సమావేశాలు, సామాజిక ఐక్యత కార్యక్రమాలు, హిందూ సదస్సులు, ప్రముఖులతో చర్చలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
Read Also: IND vs AUS: ఐదో టీ20కి వర్షం అంతరాయం
డాక్టర్ మోహన్ భగవత్
శతజయంతి వేడుకల భాగంగా సంఘ్ సర్‌సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ నవంబర్ 8 మరియు 9 తేదీలలో కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం “100 ఇయర్స్ ఆఫ్ ది సంఘ్: న్యూ హారిజన్స్” సిరీస్‌లో రెండవ ఉపన్యాసం. ఇది బెంగళూరులోని బనశంకరిలో ఉన్న పిఇఎస్ విశ్వవిద్యాలయంలో జరుగనుంది.
ఈ ఉపన్యాసానికి దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళల నుండి సుమారు 1,200 మంది ప్రముఖులు హాజరుకానున్నారు. విద్య, సాహిత్యం, కళలు, సైన్స్, జర్నలిజం, పరిపాలన, పరిశ్రమ, క్రీడలు, ఆధ్యాత్మికత వంటి విభిన్న రంగాల ప్రతినిధులను ఆహ్వానించారు.
ఆర్‌ఎస్‌ఎస్(RSS) 100వ వార్షికోత్సవం సందర్భంగా మోహన్ భగవత్ దేశవ్యాప్తంగా నాలుగు ప్రధాన నగరాల్లో ఢిల్లీ, బెంగళూరు, ముంబై, కోల్‌కతా ఉపన్యాసాలు ఇవ్వనున్నారు. “100 సంవత్సరాల సంఘ ప్రయాణం: కొత్త అవధులు” అనే శీర్షికతో ఈ సిరీస్‌లో మొదటి ఉపన్యాసం 2025 ఆగస్టు 26–28 తేదీలలో న్యూఢిల్లీలో జరిగింది. రెండవది ఇప్పుడు బెంగళూరులో జరుగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: