దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో వివిధ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (NTPC – Graduate) (RRB NTPC Railway Jobs 2025) పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌పై భారీ ఆసక్తి నెలకొంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నవంబర్ 20, 2025తో దరఖాస్తుల సమర్పణ గడువు ముగియాల్సి ఉంది.
Read Also: IT Raid: ప్రముఖ రెస్టారెంట్లు, హోటల్స్ లలో కొనసాగుతున్న ఐటీ దాడులు
గడువు నవంబర్ 27 వరకు పొడిగింపు
అయితే రైల్వే బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీ (గ్రాడ్యుయేట్) పోస్టుల దరఖాస్తు గడువును రైల్వే బోర్డు పొడిగిస్తూ ప్రకటన వెలువరించింది. ఈ ప్రకటన మేరకు నవంబర్ 20తో దరఖాస్తు గడువు ముగుస్తుండగా దానిని నవంబర్ 27వ తేదీ వరకు పొడిగించింది.
దరఖాస్తుల్లో తప్పుల సవరణకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 9వరకు అవకాశం కల్పించింది.కాగా 2025 సంవత్సరానికి సంబంధించి ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ (RRB NTPC Railway Jobs 2025) మొత్తం 5,810 గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీకి గత అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రాడ్యుయేట్ కేటగిరీలో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది.

భర్తీ చేయబోయే పోస్టులు – పూర్తి వివరాలు
ఆన్‌లైన్ రాత పరీక్ష ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. టైర్ 1, టైర్ 2 రాత పరీక్షల అనంతరం టైపింగ్ స్కిల్ టెస్ట్, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారికి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్, స్టేషన్ మాస్టర్ పోస్టులకు నెలకు రూ.35,400, ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు రూ.25,500, ఇతర పోస్టులకు రూ.29,200 చొప్పున జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు చెల్లిస్తారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: