భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో మొత్తం 8,868 ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB NTPC 2025) కింద మొత్తం ఖాళీలను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో 5,817 పోస్టులు గ్రాడ్యుయేట్ లెవెల్, 3,058 పోస్టులు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌లో భర్తీ చేయనుంది. ఇంటర్, డిగ్రీ అర్హతలతో ఈ నియామకాలకు రైల్వే బోర్డు ఎంపిక చేయనుంది.
Read Also: Visakhapatnam: 28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

అర్హతలు
(ఈరోజు) నవంబర్ 27తో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ల గడువు ముగియనుంది. ఇప్పటి వరకు దరఖాస్తు చేయని అభ్యర్ధులు, దరఖాస్తు చేసుకోవాలని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) సూచించింది.CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ (RRB NTPC 2025) పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: