రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) గ్రూప్–D పరీక్షలకు ఎదురుచూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు బిగ్ అప్డేట్. గ్రూప్–D అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేయాలి.అభ్యర్థులు https://www.rrbcdg.gov.in/ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసి, రిజిస్ట్రేషన్ నంబర్‌తో పాటు డేట్ ఆఫ్ బర్త్ (DOB) నమోదు చేస్తే వెంటనే అడ్మిట్ కార్డు పొందవచ్చు.
Read Also: AP: కానిస్టేబుల్ అభ్యర్థులకు DEC తొలి వారంలో నియామక పత్రాలు!

పరీక్షల షెడ్యూల్
ఈసారి మొత్తం 32,438 పోస్టులు భర్తీ చేయడానికి (RRB) గ్రూప్–D నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఈ పోస్టుల కోసం అప్లై చేసిన అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. పెద్దసంఖ్యలో అప్లికేషన్లు రావడంతో పరీక్షలను దశలవారీగా నిర్వహించేందుకు బోర్డు ఏర్పాట్లు పూర్తి చేసింది. 32,438 పోస్టులకు ఈ నెల 27 నుంచి 2026 జనవరి 16 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ, డేట్ వివరాలు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: