
మహారాష్ట్రలోని(Road Accident) ఠాణె జిల్లా అంబర్‌నాథ్ ఫ్లైఓవర్‌పై శుక్రవారం భయానక రోడ్డు ప్రమాదం జరిగింది. శివసేనకు చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే ప్రచార కార్యక్రమం ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ఆమె ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.
Read Also: AP: పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల
కారు నడుపుతున్న డ్రైవర్ లక్ష్మణ్‌కు ఆకస్మికంగా గుండెపోటు రావడంతో వాహనం మీద నియంత్రణ కోల్పోయాడు. దాంతో కారు వేగంగా ముందున్న బైక్‌లు, వాహనాలను ఢీకొట్టింది. ఢీకొన్న ఝలక్‌కు ఒక బైక్ రైడర్ వాహనంతో సహా ఫ్లైఓవర్ పై నుంచి కింద పడిపోయాడు. ఢీకొన్న తరువాత కారు కూడా బోల్తా పడింది.

ఈ ఘటనలో డ్రైవర్‌తో(Road Accident) పాటు మరో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో కారులో ఉన్న కిరణ్ చాబే కూడా గాయపడి, స్థానికుల సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం స్థిరంగానే ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: