Rising prices : పెరుగుతున్న ధరలు..ముంచుకొస్తున్న ఆహార, నీటి సంక్షోభం?

Follow Us: Google News Daily Hunt
Rising prices
Rising prices
FONT SIZE
GET APP

Rising prices: అంతర్జాతీయంగా అమెరికా, ఇరాన్‌ల మధ్య రోజురోజుకూ పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరోవైపు దేశీయంగా ‘ఎల్ నినో’ (El Nino) ప్రకంపనలు సృష్టిస్తున్న విలయం భారతదేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదై పంట ఉత్పత్తి భారీగా దెబ్బతినగా.. మధ్యప్రాచ్య సంక్షోభం సరఫరా వ్యవస్థలను అస్తవ్యస్తం చేసింది. ఈ పరిణామాలు కేవలం నిత్యావసరాల ధరల పెరుగుదలకు మాత్రమే కాకుండా.. భవిష్యత్తులో తీవ్రమైన ఆహార, నీటి కొరతకు దారితీసి భారత ఆర్థిక వ్యవస్థపై గట్టి ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రారంభమై నెలలు గడుస్తున్న కొద్దీ.. కేవలం ముడి చమురు ధరలు మాత్రమే కాకుండా ఆహార పదార్థాల ధరలు కూడా గణనీయంగా ఎగబాకాయి.

Read Also: Nitin Nabeen: రాహుల్ గాంధీపై నితిన్ నబీన్ ఫైర్.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు

Rising prices
Rising prices

Rising prices: ఉత్పత్తి పడిపోవడం అసలు సమస్య

ధరల నియంత్రణకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, వాతావరణ కాలుష్యాలు, ఉత్పత్తి పడిపోవడం అసలు సమస్యగా మారింది. దేశంలోని అనేక ప్రాంతాల్లో గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం నమోదైంది. వర్షాభావం కారణంగా వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, గ్రామాలు, పట్టణాల్లో తాగునీటి కొరత కూడా తలెత్తుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఉల్లి ధరలు రెట్టింపు కాగా, నీటి లభ్యత తగ్గడం వల్ల చెరకు సాగు కుదేలై చక్కెర ధరలు కూడా భయపెడుతున్నాయి. ఈ తగ్గిన ఉత్పత్తి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని దెబ్బతీసే ప్రమాదం ఉంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న వైరం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుండి వ్యూహాత్మక హార్ముజ్ జలసంధి మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనివల్ల చమురుతో పాటు ఎరువులు, గ్యాస్ సరఫరాకు తీవ్ర విఘాతం కలిగింది. రవాణా, వ్యవసాయ ఖర్చులు విపరీతంగా పెరగడం పరోక్షంగా కూరగాయల నుండి తృణధాన్యాలు, వంట నూనెల వరకు ప్రతి ఒక్క వస్తువు ధరను అమాంతం పైకి లాగుతోంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు