తొలి అర్ధ సంవత్సరంలో రూ.9606.24 ఆర్జన
గుంతకల్లు రైల్వే : తెలుగు రాష్ట్రాలలోని దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) ప్రస్తుత 2025-26 ఆర్థిక సంవత్సరం, తొలి అర్ధ సంవత్సరం ఏప్రిల్ -సెప్టెంబర్ మధ్యకాలంలో రూ.9,606.24 కోట్లు ఆర్జించింది. ఇందుకు సంబంధించి డివిజన్ల వారీగా ఆర్జించిన స్థూల ఆదాయం(Revenue) వివరాలు ఇలా ఉన్నాయి. సరుకు రవాణా విభాగంలో: సికింద్రాబాద్ డివిజన్లో 39.576 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.3732.47 కోట్ల మేర ఆదాయం లభించగా, విజయవాడ డివిజన్లో 21.621 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.2114.62 కోట్లు, గుంతకల్లు డివిజన్లో 7.374 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా . 418.13 కోట్లు, గుంటూరు డివిజన్లో 1.662 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.173.41 కోట్లు, హైదరాబాద్ డివిజన్లో 0.668 సరుకు రవాణా ద్వారా రూ.116.73 కోట్లు, నాందేడ్ డివిజన్లో 0.242 మిలియన్ టన్నుల సరుకు రవాణా ద్వారా రూ.54.46 కోట్ల చొప్పున మొత్తం 71.142 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేయడం ద్వారా రూ.6609.82 కోట్ల రూపాయల ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వే ఆర్జించింది.
Read also: Mohammed Shami: ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక చేయకపోవడంపై స్పందించిన షమీ

ప్రయాణికుల విభాగంలో రూ.2996.42 కోట్ల ఆదాయం
ప్రయాణికుల విభాగంలో: సికింద్రాబాద్ డివిజన్లో అత్యధికంగా 40.99 మిలియన్ల ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.1,058.42 కోట్ల ఆదాయం లభించగా, విజయవాడ డివిజన్లో 36.84 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.734.92 కోట్లు, గుంతకల్లు డివిజన్లో 22.18 మిలియన్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ.534.65 కోట్లు, నాందేడ్ డివిజన్లో 18.15 మిలియన్ల ప్రయాణికుల ద్వారా రూ.272.43 కోట్లు, హైదరాబాద్ డివిజన్లో 14.39 మిలియన్ల ప్రయాణికుల ద్వారా రూ.267.21 కోట్లు, గుంటూరు డివిజన్లో 9.85 మిలియన్ల ప్రయాణికుల ద్వారా రూ.128.80 కోట్ల ఆదాయం(Revenue) దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆర్జించింది.
సరుకు రవాణా విభాగంలో రూ.6609.82 కోట్లు, ప్రయాణికుల విభాగంలో రూ.2,996.42 కోట్లు వెరసి మొత్తంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో రూ.9606.24 కోట్ల రూపాయల ఆదాయాన్ని దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆర్జించింది.
దక్షిణ మధ్య రైల్వే 2025-26 తొలి అర్ధ సంవత్సరంలో ఎంత ఆదాయం ఆర్జించింది?
మొత్తం రూ.9,606.24 కోట్ల ఆదాయం ఆర్జించింది.
సరుకు రవాణా విభాగం ద్వారా ఎంత ఆదాయం వచ్చింది?
రూ.6,609.82 కోట్ల ఆదాయం లభించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: