ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ఘటన కార్పొరేట్ రంగంలో మానవీయతపై తీవ్ర చర్చకు దారితీసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని చూసుకోవడానికి కొన్నిరోజులు సెలవు కావాలని కోరిన ఓ ఉద్యోగికి ఆమె మేనేజర్ ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. ‘మీ తల్లిగారిని ఆసుపత్రిలోనో లేక ఏదైనా షెల్టర్ హోంలోనో చేర్చి ఆఫీసుకు వచ్చేయండి’ అని చెప్పాడు. ఈ సమాధానంతో తీవ్ర ఆవేదనకు గురైన ఆ ఉద్యోగి అక్కడికక్కడే రాజీనామా (Resignation) లేఖ రాసిచ్చి వెళ్లిపోయింది.
Read also: Venezuela: మదురో తరపున వాదించే లాయర్ ఈ కేసులో నెగ్గేనా?
ఉచిత సలహా
మేనేజర్ తీరును ఎండగడుతూ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను ఓ యూజర్ రెడిట్ లో పోస్ట్ చేశాడు.వివరాల్లోకి వెళితే.. ఓ ప్రైవేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న మహిళ ఇటీవల సెలవు కావాలని మేనేజర్ కు విజ్ఞప్తి చేసింది. తన తల్లి అనారోగ్యంతో బాధపడుతోందని, ఆమెను దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

అయితే, సదరు మేనేజర్ మాత్రం సెలవు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇదే కారణంతో ఇప్పటికే పలుమార్లు సెలవు పెట్టారని, మీ తల్లి అనారోగ్యం నుంచి కోలుకోకపోతే ఏదైనా షెల్టర్ హోంలో చేర్పించాలని ఉచిత సలహా ఇచ్చాడు. మేనేజర్ తీరుతో కంగుతిన్న ఆ మహిళా ఉద్యోగి గత్యంతరం లేక అప్పటికప్పుడే రాజీనామా చేసింది.రాజీనామా చేసింది గానీ తన తల్లిని మాత్రం దూరం చేసుకోలేదు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: