భారతీయ రైల్వే (Indian Railways) మంత్రిత్వ శాఖ తత్కాల్ టికెట్ బుకింగ్ (Ticket booking) సదుపాయంలో దుర్వినియోగాన్ని అరికట్టడానికి మరియు భద్రతను పెంచడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ (Reservation) కౌంటర్లలో బుక్ చేసే అన్ని తత్కాల్ టికెట్లకు త్వరలోనే తప్పనిసరిగా వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వెరిఫికేషన్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ కొత్త విధానంలో ప్రయాణికులు తత్కాల్ టికెట్లు బుక్ చేసేటప్పుడు మొబైల్ నంబర్‌ను అందించాలి, ఆ నంబర్‌కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాతే టికెట్ బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది.
Read Also: Pakistan: జైషే మహిళా వింగ్‌లో ఆన్‌లైన్ శిక్షణకు పెరుగుతున్న సంఖ్య
ఈ ఓటీపీ వెరిఫికేషన్ (OTP Verification) వ్యవస్థను ఏజెంట్లు, కొందరు వ్యక్తులు అధిక డిమాండ్ ఉన్న టిక్కెట్‌లను పెద్ద మొత్తంలో అక్రమంగా పొందకుండా నిరోధించడంతోపాటు, నిజమైన ప్రయాణికులకు ప్రాధాన్యత ఇవ్వడానికి తీసుకువచ్చారు. రైల్వే టికెట్ల బుకింగ్‌లో పారదర్శకత, భద్రతను పెంచడమే ఈ నిర్ణయం యొక్క ప్రధాన లక్ష్యం.

దేశవ్యాప్తంగా అమలుకు సన్నాహాలు
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ ఓటీపీ ధృవీకరణ వ్యవస్థను నవంబర్ 17వ తేదీన కొన్ని ఎంపిక చేసిన రైళ్లలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్‌కు సానుకూల స్పందన రావడంతో, ఇప్పటికే ఈ విధానాన్ని 52 రైళ్లకు విస్తరించారు. త్వరలోనే దేశవ్యాప్తంగా మిగిలిన అన్ని రైళ్లకు, అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో ఈ విధానాన్ని అమలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
ఆన్‌లైన్ బుకింగ్‌లకు ఆధార్ ఆధారిత ధృవీకరణ
ఈ ఏడాది జూలైలోనే రైల్వే మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ తత్కాల్ బుకింగ్‌లకు దేశవ్యాప్తంగా ఆధార్ ఆధారిత ఓటీపీ ధృవీకరణను తప్పనిసరి చేసింది. అంతేకాకుండా, అక్టోబర్ 1వ తేదీ నుంచి.. బుకింగ్‌లు ప్రారంభమైన మొదటి 15 నిమిషాల వరకు.. ఆధార్ ద్వారా ధృవీకరించబడిన వినియోగదారులకు మాత్రమే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌లో సాధారణ టికెట్‌లను బుక్ చేసుకోవడానికి అనుమతిస్తున్నారు. ఈ చర్యలన్నీ టికెట్ బుకింగ్ విధానంలో పారదర్శకతను పెంచేందుకు రైల్వే శాఖ తీసుకుంటున్న చర్యల్లో భాగమే.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: