గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో నిర్వహించనున్న ఆర్డీ పరేడ్‌లో సీఆర్‌పీఎఫ్ మార్చింగ్ బృందానికి సిమ్రన్ బాలా కమాండర్‌గా వ్యవహరించనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టం ద్వారా ఆమె దేశవ్యాప్తంగా మహిళలకు ప్రేరణగా నిలవనున్నారు. కేవలం 26 ఏళ్ల వయసులోనే 140 మంది పురుషులతో కూడిన సీఆర్‌పీఎఫ్ మార్చింగ్ బృందానికి నాయకత్వం వహించడం ఇదే తొలిసారి కావడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో అసిస్టెంట్ కమాండెంట్‌గా పనిచేస్తున్న సిమ్రన్ బాలా, పారామిలిటరీ దళంలో ఆఫీసర్ ర్యాంక్‌లో చేరిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. ఆమె యూపీఎస్సీ CAPF అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
Read Also: Davos : పెట్టుబడుల వేటలో తెలుగు రాష్ట్రాల సీఎంలు!

పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి
దేశంలోని అంతర్గత భద్రతకు చెందిన సీఆర్పీఎఫ్ దళంలో సుమారు 3.26 లక్షల సిబ్బంది ఉన్నారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్, జమ్మూకశ్మీర్‌లో కౌంటర్ టెర్రరిజం, ఈశాన్య రాష్ట్రాల్లో చొరబాటు ఏరివేతల టార్గెట్‌గా సీఆర్పీఎఫ్ దళాలు పనిచేస్తున్నాయి.జమ్మూలోని గాంధీనగర్‌లో ఉన్న ప్రభుత్వ మహిళా కాలేజీలో సిమ్రన్ బాలా పొలిటికల్ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
2025 ఏప్రిల్‌లో ఆమె సీఆర్పీఎఫ్ దళంలో చేరింది. చత్తీస్‌ఘడ్‌లోని బస్తరియా బాటాలియన్‌లో ఆమె తొలి పోస్టింగ్. యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో పాల్గొన్నది. శిక్షణ సమయంలో సీఆర్పీఎఫ్ అకాడమీలో ఆమె బెస్ట్ ఆఫీసర్ అవార్డు గెలుచుకున్నది. యూపీఎస్సీ నిర్వహించే సీఏపీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ పరీక్షలో ఆమె క్వాలిఫై అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: