కేంద్ర కార్మిక శాఖ గిగ్ (Gig Workers), ప్లాట్‌ఫాం కార్మికుల విషయంలో కీలక ప్రకటన చేసింది. గిగ్ వర్కర్లు, ప్లాట్‌ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 సంవత్సరాలు నిండివుండాలని స్పష్టం చేసింది. ఆధార్, ఇతర డాక్యుమెంట్ల ద్వారా ఈ-శ్రమ్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంది. కార్మికులు ఏడాదిలో కనీసం 90 రోజులు పనిచేయాల్సి ఉంటుంది.
Read Also: Delhi HC: ప్రెగ్నెన్సీ తొలగించుకునేందుకు భర్త అనుమతి అవసరం లేదు

రిజిస్ట్రేషన్ విధానం ఇలా..
అసంఘటిత, గిగ్ (Gig Workers) కార్మికులుగా కనీసం 16 ఏళ్లు నిండిన వారు సొంత డిక్లరేషన్‌పై ఆధార్‌తో పాటు ఇతర పత్రాలు సమర్పించి పేర్లు నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్, పోర్టల్‌ను కేంద్రం అందుబాటులోకి తీసుకురానుంది. ఈ పోర్టల్‌లో ఆయా రాష్ట్రాలు తమ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి కార్మికుడికి ప్రత్యేక యూఏఎన్ నంబర్ కేటాయించనుంది. అనంతరం కార్మికుడి ఫొటో, వ్యక్తిగత వివరాలతో కూడిన డిజిటల్ ఐడీ కార్డును కేంద్రం జారీ చేస్తుంది. సామాజిక భద్రత పథకాలు ప్రకటించిన తర్వాత అర్హతలకు సంబంధించిన నియమావళి కూడా అందుబాటులోకి రానుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: