RBI-స్మార్ట్ఫోన్(Smart Phone) కావాలనుకోవడం ఆలస్యం.. షాపుకెళ్లి నచ్చిన ఫోన్ ను ఈఎంఐ రూపంలో కొనేస్తారు. ఆ తర్వాత ఈఏంఐలు కట్టకుండా ఎగరగొట్టేవారు లేకపోలేదు. విచిత్రం
ఏమిటంటే ఇటీవల ఈ సంఖ్య పెరిగిపోతున్నది. దేశంలో చాలామంది ఫోన్లను లోన్(Loan)
రూపంలో కొంటున్నారు. ఈఏంఐ లరూపంలో కొనుగోలు చేస్తున్నారు. అనంతరం ఆ డ
బ్బును కట్టకుండా ఎగరగొట్టేస్తున్నారు. దీంతో ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకునే యోచనలో
ఉంది. ఫోన్ కొనే సమయంలోనే ఒక యాప్ ను ఇన్స్టాల్ చేయనున్నారు ఫైనాన్స్ కంపెనీలు.
ప్రజల హక్కులకు భంగం కలగకుండా.. ఫోన్ కొనేవారి నుండి ముందస్తు అనుమతి
తీసుకొని, వ్యక్తిగత డేటాను యాక్సెస్ చేయకుండా ఐర్బీఐ నిబంధనలను తీసుకురానున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఫోన్లు కొనేసి, ఆ డబ్బును ఈఎంఐల ద్వారా చెల్లించకుండా మోసం చేస్తుంటారు. ఇలాంటప్పుడు ఆ ఫోన్ ను లాక్ చేసే అధికారం సదరు కంపెనీలకు ఇవ్వాలనే యోచనలో ఆర్బీఐ ఉన్నట్లు తెలుస్తోంది.

EMIలు కట్టకపోతే ఫోన్‌ను లాక్ చేసే అధికారం ఎవరికుంది?
ఫైనాన్స్ కంపెనీలకు ఈ అధికారం RBI అనుమతితో లభించింది.
EMI చెల్లించని వినియోగదారులకు ముందుగా సమాచారం ఇస్తారా?
అవును, ముందుగా లిఖితపూర్వక సమాచారం ఇవ్వాలి.
Read hindi news: hindi.vaartha.com
Read also: