బిహార్ లో, జేడీయూ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ (RajivRanjanSingh) అలియాస్ లలన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూన్నాయి.
Read Also: Indian Navy: ఇండియన్ నేవీ వేగవంతమైన విస్తరణ – ప్రతి 40 రోజుకి కొత్త నౌక!

బిహార్‌లోని మొకామాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ‘పేదలను ఓటు వేయకుండా అడ్డుకోండి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఈ వీడియో వైరలవ్వడంతో పట్నా జిల్లా పోలీసులు ఆయన (RajivRanjanSingh) పై కేసు నమోదు చేశారు. ఎన్నికల కమిషన్ కూడా వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: