हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

Rajasthan: 90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన కురు వృద్దుడు

Sharanya
Rajasthan: 90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన కురు వృద్దుడు

ప్రేమ, నిబద్ధత, మరియు జీవితం పట్ల ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచే ఈ ఘటన రాజస్థాన్‌ (Rajasthan) లోని డుంగర్‌పూర్ జిల్లా గలందర్ గ్రామంలో చోటుచేసుకుంది. 95 ఏళ్ల రామా భాయ్ అంగారి మరియు 90 ఏళ్ల జీవలీ దేవి దంపతులు తమ 70 ఏళ్ల సహజీవనాన్ని సంప్రదాయబద్ధంగా పెళ్లిగా మార్చుకున్నారు. ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ కళ్ళల్లో ఆనందభాష్పాలతో వ్యక్తం చేశారు.

Rajasthan: 90 ఏళ్ల బామ్మను పెళ్లాడిన కురు వృద్దుడు

70 ఏళ్ల సహజీవన బంధానికి చట్టబద్ధ ముద్ర

95 ఏళ్ల రామా భాయ్ అంగారి, 90 ఏళ్ల జీవలీ దేవి దంపతులు గత 70 ఏళ్లుగా కలిసే జీవిస్తున్నారు. వీరికి ఎనిమిది మంది సంతానం. వీరి పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవారై, వారిలో నలుగురు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరి పెద్ద కుమారుడు బాకు అంగారి (60) వ్యవసాయం చేస్తుండగా, రెండో కుమారుడు శివరామ్ (55), మూడో కుమారుడు కాంతిలాల్ (52) ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మరో కుమారుడు లక్ష్మణ్ (52) కూడా వ్యవసాయదారుడే. కుమార్తెలు సునీత ఉపాధ్యాయురాలిగా, అనిత నర్సుగా సేవలందిస్తున్నారు. వీరికి మనవళ్లు, మనవరాళ్లు కూడా ఉన్నారు.

కుటుంబం కలసికట్టుగా చేసిన కళ్యాణ వేడుక

ఈ ముసలిదంపతుల కోరికను గౌరవించి, వారి పిల్లలు వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. హల్దీ, మెహందీ వంటి వివాహ పూర్వచర్యలతో ప్రారంభమైన ఈ వేడుక, డీజేలు, ఊరేగింపులతో ఊరి మొత్తాన్ని ఒక పండుగ వాతావరణంలోకి తీసుకెళ్లింది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ప్రేమ పథం

ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ వివాహ వేడుకను తిలకించేందుకు గ్రామస్థులు వేలాదిగా తరలివచ్చారు. పెళ్లి తంతులో భాగంగా వధూవరులు ఏడడుగులు నడిచారు. వచ్చిన అతిథులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. పెళ్లికూతురు, పెళ్లికొడుకు ముఖాల్లో చిరునవ్వులు చిందిస్తూ, కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా కనిపించారు. ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

సమాజానికి సందేశంగా నిలిచిన ఈ ఘట్టం

ఈ సంఘటన నేటి తరం యువజనులకు, పెళ్లి అనే బంధాన్ని తేలికగా తీసుకునే వారికి ఒక గుణపాఠంలా మారింది. చాలామంది తమ జీవిత భాగస్వామితో చిన్నచిన్న విభేదాలతో దూరమవుతున్న తరుణంలో, ఈ జంట 70 ఏళ్ల పాటు ఒకరికొకరు తోడుగా నిలవడం ఎంతో గొప్ప విషయం.

Read also: Kamal Haasan: ప్రజలపై హిందీ బలవంతంగా రుద్దొద్దు: కమల్

Train accident: ట్రైన్ లో విపరీతమైన రద్దీతో జారీ పడ్డ ప్రయాణికులు 5 గురు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870