రాజస్థాన్‌లోని జైపూర్‌లో ప్రేమ, ప్రతీకారం పేరుతో జరిగిన క్రూరమైన ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. వితంతువు సోని, కైలాష్(Rajasthan) మధ్య ఉండే సంబంధాన్ని అంగీకరించలేక, ఆమె భర్త కుటుంబ సభ్యులు ఇద్దరినీ దారుణంగా హత్య చేశారు. ఏకాంతంగా కలుసుకుంటున్న వీరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న తర్వాత కట్టేసి, పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారు. తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రిలో(Hospital) చికిత్స పొందుతున్న ఈ ప్రేమజంట అనంతరం మరణించడంతో కేసు హత్యగా మార్చబడింది.
Read also: PM మోదీకి CM రేవంత్ అందించిన వినతులివే

దారుణ దాడికి దారితీసిన పాత వైరం
సోని తన భర్త మరణించిన(Rajasthan) తర్వాత ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తూ ఉండేది. ఈలోపులో కైలాష్‌తో పరిచయం ఏర్పడి, వారి స్నేహం ప్రేమగా మారింది. కైలాష్కు కూడా కుటుంబం ఉన్నప్పటికీ, ఇద్దరూ సంబంధాన్ని కొనసాగిస్తూ, తరచుగా ఏకాంతంగా కలుస్తుండేవారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇద్దరూ కలిసిన సమయంలో సోని భర్త బంధువులు వారిని అనుసరించి అక్కడికి చేరుకున్నారు. ఆగ్రహంతో ఊగిపోయిన వారు మొదట వారిని కట్టేసి, ఆపై తెచ్చుకున్న పెట్రోల్ పోసి నిప్పంటించారు. కైలాష్ 70 శాతం, సోని 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ దాడి వెనుక ఉన్న నిజమైన కారణం కేవలం వివాహేతర సంబంధం మాత్రమే కాదని దర్యాప్తులో తేలింది. గత సంవత్సరం సోని బావమరిది కొడుకు, కైలాష్ సోదరుడి కూతురు ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య పాత విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. ఈ వైరం, సోని–కైలాష్ సంబంధం కలిసి దాడికి దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి ప్రధాన నిందితులు బిర్ది చంద్, గణేష్ గుర్జర్లను అరెస్టు చేయగా, ఈ ఘటనలో పాల్గొన్న మరికొందరిని కూడా పట్టుకోవాలని బాధితుల కుటుంబం డిమాండ్ చేస్తోంది. గ్రామస్థులు కూడా నిరసనకు దిగడంతో అధికారులు కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: