గొప్ప చదువులు చదివి, ఉన్నతమైన ఉద్యోగాలు (Rajasthan) చేస్తే చాలు ఇక తమ ఆడపిల్లల జీవితాలు సుఖమయమైపోతుందని ప్రతి తల్లిదండ్రులు భావిస్తారు. ఇక కష్టాలు అనేవి ఏవీ ఉండవని, జీవితమంతా హ్యాపీగా సాగిపోతుందని అనుకుంటారు. కానీ అందరి విషయంలో ఇదే కరెక్టని అనుకోలేం. ఆమె ఒక ఐఎఎస్ అధికారిణి, కానీ ఆమెను ఓ ఆడపిల్లగా చూసి, చిత్రహింసలకు గురిచేసిన సంఘటన ఇది.
Read also: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రిగ్గింగ్ సాధ్యం కాదు: PCC చీఫ్

ప్రేమ.. పెళ్లి చేసుకున్న ఐఏఎస్ అధికారులు
ఆమె ఒక కలెక్టర్.. పెళ్లి చేసుకుంది కూడా ఓ కలెక్టర్ నే. కానీ భార్య ఇంటికొచ్చేసరికి అసలు టార్చెర్ ను చూపించసాగాడు. భర్త చేష్టలతో విసిగిపోయిన సదరు ఐఏఎస్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయకతప్పలేదు. రాజస్థాన్ కు(Rajasthan) చెందిన ఐఏఎస్(IAS) దంపతుల గొడవలు చివరకు పోలీసు స్టేషన్ కు చేరాయి. భార్య ఫిర్యాదు ప్రకారం.. 2014 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ భారతి దీక్షిత్, ఆశిష్ మోడి ఇద్దరూ భార్యాభర్తలు. ప్రస్తుతం భారతి దీక్షిత్ ఆర్థికశాఖలో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఆశిష్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ మెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. వీరికి 2014లో వివాహం జరిగింది. అయితే భర్త తనను మోసం చేసి బలవంతంగా వివాహం చేసుకున్నాడని భారతి ఆరోపిస్తున్నారు.
మానసికంగా, శారీరకంగా హింసించిన భర్త
వివాహం జరిగిన తర్వాత కొన్నాళ్లపాటు బాగానే ఉన్నామని.. ఆ తర్వాత నుంచి భర్త తనను తరచుగా వేధించేవాడని, మానసికంగా, శారీరకంగా హింసించేవాడని ఐఏఎస్ భారతి దీక్షిత్ జైపూర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. తతను తుపాకీతో బెదిరించాడని.. కిడ్నాప్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేశారు. విడాకులు ఇవ్వాలని తనను బెదిరించాడని.. చంపేస్తానని బ్లాక్ మెయిల్ చేసినట్లు భారతి వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: