రాజస్థాన్ (Rajasthan) రాష్ట్రం అజ్మీర్ జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన ఆందోళనను రేకెత్తించింది. బాదలియా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న ఒక తొమ్మిదేళ్ల బాలిక తరగతిలో ఉన్న సమయంలో అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కుప్పకూలిపోయింది. వెంటనే పాఠశాల సిబ్బంది ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ, వైద్యులు ఆమెను ప్రాణాలతో నిలబెట్టలేకపోయారు.

చిన్న వయస్సులో గుండెపోటు – అరుదైన కానీ పెరుగుతున్న ప్రమాదం
చిన్నపిల్లల్లో గుండెపోటు వంటి తీవ్రమైన సమస్యలు చాలా అరుదుగా కనిపిస్తాయి. పోలీసుల కథనం ప్రకారం.. మంగళవారం అజ్మీర్ జిల్లాలోని బాదలియా గ్రామంలోని స్కూల్‌లో జరిగిందీ ఘటన. బాధిత బాలిక ఆరో తరగతి చదువుతోంది. పాఠాలు వింటూ ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయింది (Fell unconscious). స్కూల్ సిబ్బంది వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాలిక పల్స్ పడిపోవడం, రక్తపోటు తగ్గడంతో వైద్యులు ఆమెను బతికించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
వైద్యుల ప్రాథమిక నివేదిక ప్రకారం, గుండెపోటే (heart attack) బాలిక మృతికి కారణమై ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. అయితే, ఆమెకు గతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. ఈ వార్త తెలియగానే గ్రామస్థులు, పాఠశాల సిబ్బంది తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
స్కూల్‌లలో ఆరోగ్య సదుపాయాల అవసరం
ఈ ఘటన ద్వారా విద్యాసంస్థల్లో తక్షణ వైద్య సహాయం, ఆరోగ్య తనిఖీలు, మరియు విద్యార్థుల ఆరోగ్య సమాచారాన్ని ముందుగానే గమనించే వ్యవస్థలు ఉండటం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది .
Read hindi news: hindi.vaartha.com
Read also: Parliament Sessions : కేంద్రాన్ని ఇరుకునపెట్టేలా కాంగ్రెస్ వ్యూహం!