తమిళనాడు(Rain alert) మరియు పుదుచ్చేరిలో వాతావరణ పరిస్థితులు తీవ్రంగా మారుతున్న నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. ఈ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యగా 18 జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలకు సోమవారం సెలవులు ప్రకటించింది. విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read also: ఫ్యూచర్ సిటీపై CM రేవంత్ బిగ్ స్టెప్

రెండు వేర్వేరు వాయుగుండాల ప్రభావంతో తీవ్ర వర్షాలు
బంగాళాఖాతంలో(Rain alert) ఒకేసారి రెండు సైక్లోనిక్ సిస్టమ్‌లు ఏర్పడటంతో తమిళనాడులో వచ్చే 48 గంటల్లో విస్తృత స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ వాయుగుండాల ప్రభావం ఇప్పటికే కనిపించడం ప్రారంభమైంది. తెంకాసి, తిరునెల్వేలి, తూత్తుకుడి, కన్యాకుమారి వంటి దక్షిణ జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లోనీటిమట్టం పెరుగుతున్న దృష్ట్యా స్థానిక అధికారులు అప్రమత్తంగాున్నారు.
అత్యవసర విభాగాలు, రెవెన్యూ బృందాలు, పోలీస్ సిబ్బంది సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ అంతర్గత విభాగాలు ఆదేశాలు జారీ చేశాయి. అవసరమైతే పాఠశాలల సెలవులను మరికొన్ని జిల్లాలకు కూడా విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. చేపల వేటకు వెళ్లరాదని మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయగా, తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: