తమిళనాడులో (Tamil nadu) మళ్లీ వర్షాలు విరుచుకుపడుతున్నాయి. బంగాళాఖాతంలోని దక్షిణ అండమాన్ సముద్రం వద్ద ఏర్పడ్డ అల్పపీడనం బలపడడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారిపోయింది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ 16 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసింది.
Read also: G20 Summit 2025: సరిహద్దులను మార్చడానికి ఏ దేశం బలప్రయోగం చేయకూడదు..జీ20 ప్రకటన

Low pressure alert issued in Tamil Nadu due to heavy rainfall
భారీ నుంచి అతి భారీ వర్షాలు
దక్షిణ, మధ్య, ఉత్తర తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ప్రకటించింది. ముఖ్యంగా కన్యాకుమారి, తిరునెల్వేలి, తెన్‌కాశి, తూత్తుకుడి, రామనాథపురం, విరుదునగర్, మధురై, శివగంగ వంటి జిల్లాల్లో వర్షాలు మరింత ఉధృతమయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే తంజావూరు, నాగపట్నం, తిరువారూర్, కడలూరు వంటి డెల్టా జిల్లాలకు కూడా అలర్ట్ జారీ చేసింది. పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లోనూ వర్షపాతం పెరుగుతుందని అధికారులు చెప్పారు.
భారీ వర్షాల ప్రభావంతో తిరుచెందూర్ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలోకి వరద నీరు చేరి భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తామిరబరణి నది పరివాహక ప్రాంతాల్లో నీటిమట్టం పెరగడంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తూత్తుకుడి జిల్లా కలెక్టర్ సూచించారు.
మరోవైపు, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. లోతట్టు ప్రాంత నివాసితులు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని, సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం తెలిపింది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :