గ్రామీణ ప్రాంతాల్లో రైల్వే టికెట్ బుకింగ్‌కు పోస్టాఫీసులు కేంద్రంగా
మరింత విస్తృతంగా ప్రయాణికులకు సౌకర్యాలు
న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ఎంపికచేసిన పోస్టాఫీసులలో రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకునే సౌకర్యం ప్రారంభం అవుతోంది. రైల్వే స్టేషన్లు లేదా కౌంటర్లు లేని మారుమూల ప్రాంతాల్లోని ప్రజల కోసం, రైల్వే మంత్రిత్వ శాఖతో కలిసి రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను పోస్టాఫీసుల్లో బుక్ చేసుకునే సేవను ప్రారంభించింది. ఈ సదుపాయం ద్వారా అన్ని తరగతుల రైల్వే రిజర్వేషన్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. రైల్ హెడ్ లేదా రైల్వే (Railway Booking) కౌంటర్లు లేని ప్రాంతాలపై దృష్టి సారించి ఈ సేవ ప్రారంభించింది. ప్రస్తుతం దేశం అంతటా 333 పోస్టాఫీసులలో రైల్వే టిక్కెట్ బుకింగ్ సేవ అందుబాటులో ఉంది. ఇందులో ఎక్కువ భాగం గ్రామీణ, పాక్షిక గ్రామీణ ప్రాంతాలలో ఉన్నాయి. తద్వారా రైల్వే ప్రయాణ సౌలభ్యాన్ని మెరుగుపరుస్తున్నాయి.
Read also: విద్యార్థులకు దీపావళి సెలవులు పొడిగింపు!

మారుమూల ప్రాంతాల ప్రయాణికులకు మెరుగైన సేవలు
ఇప్పుడు రైల్వే టికెటింగ్ సేవను జోడించడం ద్వారా తమ సేవలను మరింత విస్తరించింది. పోస్టాఫీసు ఇంటి వద్దకే రైల్వే టిక్కెట్లను డెలివరీ చేసే సేవను కూడా అందిస్తుంది. రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకునే ప్రయాణీకులు ప్యాసింజర్ రిజర్వేషన్ (Railway Booking) సిస్టమ్ కౌంటర్ ఉన్న పోస్టాఫీసుకు వెళ్లాలి. సాధారణంగా ఇవి రైల్వే స్టేషన్ లేదా కౌంటర్లు లేని ప్రాంతాలలో ఉంటాయి. ఇండియా పోస్ట్ (India Post) వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. కౌంటర్ వద్ద ఉన్న సిబ్బందికి మీ ప్రయాణ సమాచారాన్ని తెలియచేసి అక్కడ ఉన్న రిజర్వేషన్ ఫాం నింపి, టికెట్ డబ్బు కట్టాలి. పోస్టాఫీసు ద్వారా రైల్వే టిక్కెట్లను బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రావడంతో, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలు రైల్వే ప్రయాణ సేవలను మరింత సులభంగా పొందగలుగుతారని కేంద్రం భావిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: