Indian Railways: డిజిటల్ లావాదేవీలను మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశంతో భారతీయ రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా జనరల్ (Unreserved) టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు 3 శాతం వరకు రాయితీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రత్యేక డిస్కౌంట్‌ను ‘రైల్‌వన్’(RailOne app) మొబైల్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి మాత్రమే వర్తింపజేయనున్నారు.
Read also: Amazon: హెచ్-1బి ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

రైల్వే అధికారుల వివరాల ప్రకారం, ఈ ఆఫర్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు మొత్తం ఆరు నెలల కాలానికి అమల్లో ఉంటుంది. యూపీఐ, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ వంటి ఏ డిజిటల్ చెల్లింపు విధానం ద్వారా టికెట్ కొనుగోలు చేసినా 3 శాతం తగ్గింపు లభిస్తుంది. రైల్వే స్టేషన్ల(Indian Railways)లో టికెట్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీని తగ్గించడంతో పాటు, నగదు లావాదేవీలపై ఆధారాన్ని తగ్గించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం.
ఇప్పటికే రోజూ లక్షలాది మంది ప్రయాణికులు అన్‌రిజర్వ్‌డ్ టికెట్లు వినియోగిస్తున్న నేపథ్యంలో, ఈ డిస్కౌంట్ వల్ల మరింత మంది డిజిటల్ మార్గాన్ని ఎంచుకుంటారని అధికారులు భావిస్తున్నారు.
రైల్‌వన్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేయడం సులభమని, సమయం కూడా ఆదా అవుతుందని రైల్వే శాఖ చెబుతోంది. భవిష్యత్తులో డిజిటల్ సేవలను మరింత విస్తరించి, ప్రయాణికులకు కొత్త ఆఫర్లు, సౌకర్యాలు అందించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: