ఇటీవల చదువుల ఒత్తిడిని తట్టుకోలేక పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పెరుగుతున్న ఫీజులతో ఒకవైపు తల్లిదండ్రుల నుంచి మరోవైపు కళాశాల నుంచి వారికి చదువుపై తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఒకవైపు పెరుగుతున్న జనాభా, కొరవడుతున్న ఉపాధి అవకాశాలు.. కోర్సులు అయిపోయినా ఉద్యోగాలు రాక అల్లాడుతున్న నిరుద్యోగులు ఒకవైపు, భారీ కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉన్నత చదువులు చదువుతున్నవారి ఒత్తిడి అంతాఇంతా కాదు. దీంతో వారు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటున్నారు. పరీక్షల ఒత్తిడి భరించలేక.. ఛత్తీస్ గఢ్ (Chhattisgarh) లోని రాయ్ గఢ్ ఓ విషాదం జరిగింది.
Read also: Madhya Pradesh: బతికున్న కుమార్తెకు తండ్రి అంత్యక్రియలు..

Raigarh
‘క్షమించండి అమ్మా, నాన్న’ మీ అంచనాలను అందుకోలేకపోతున్నా
బీటెక్ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు నోట్ లో అన్ని విషయాలు రాసి ప్రాణాలు తీసుకుంది. ప్రిన్సీ కుమారి(20) జార్ఖండ లోని జంషెడ్ పూర్ నివాసి. ఛత్తీస్ గఢ్ జిల్లాలోని ఒక విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ బిటెక్ రెండవ సంవత్సరం చదువుతోంది. పుంజిపాత్ర సమీపంలోని విశ్వవిద్యాలయ హాస్టల్ లో నివసిస్తోంది. శనివారం రాత్రి హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా ఒక సూసైడ్ నోట్ ను రాసింది. ‘క్షమించండి అమ్మా, నాన్న’ మీ అంచనాలను అందుకోలేకపోతున్నా.. పరీక్షల ఒత్తిడి భరించలేకపోతున్నట్లు వాపోయింది. నా చదువు కారణంగా కుటుంబంపై ఆర్థిక భారం పడకూడదని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొంది.
పదేపదే కాల్ చేసినా స్పందన లేదు
ఫోన్ చేస్తున్నా స్పందన లేకపోవడంతో అనుమానం.. ప్రిన్సీ కుటుంబం శనివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో పదేపదే కాల్ చేసినా స్పందన లేదు. దీంతో హాస్టల్ వార్డెన్ ను సంప్రదించారు. వార్డెన్ గదికి చేరుకున్నప్పుడు తలుపు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. దీంతో వార్డెన్ కిటికీ గుండా చూడగా ఉరి వేసుకుని కనిపించింది. ప్రిన్సీకి మొదటి సెమిస్టర్ లో ఐదు సబ్జెక్టులలో బ్యాక్ లాగ్ లు ఉన్నాయని.. తిరిగి పరీక్షలకు సిద్ధమవుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. సబ్జెక్టులు పోయినా మళ్లీ చదువుకోవచ్చు.. కానీ ఇలా ప్రాణాలు తీసుకోవడం ఎందుకని ప్రిన్సీ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: