కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహించిన ఓ మీడియా సమావేశం ఓ సామాన్యుడికి తీవ్ర ఇబ్బందిని తెచ్చిపెట్టింది. ‘ఓట్ల చోరీ’ వ్యవహారంపై ఆయన మాట్లాడుతూ, పొరపాటున ఒక వ్యక్తి ఫోన్ నంబర్(Phone number) ను బహిరంగంగా చెప్పేశారు. దీంతో ఈ వ్యక్తి నిమిషాలకో ఫోన్ కాల్ వస్తూ జీవితం నరకరంగా మారింది. ఈ అనూహ్య ఘటనపై బాధితుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతున్నట్లు హెచ్చరించారు.

అవాక్కైన అంజనీ మిశ్రా
‘ఓట్ల తొలగింపు”(Elimination of votes) అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిన్న ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మీడియా సమా దేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా, ఒక ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా వ్యవస్థీకృతంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. దీనిని ‘ఓటు చోరీ‘గా అభివర్ణించారు. కర్ణాటకలోని అలంద్, మహారాష్ట్రలోని రజోరా నియోజకవర్గాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఉదాహరణలు ఇచ్చారు. ఈ కుట్రను వివరిస్తున్న క్రమంలోనే, ఆయన ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ రాజ్కు చెందిన అంజనీ మిశ్రా అనే వ్యక్తి ఫోన్ నెంబర్ ను ప్రస్తావించారు.
వెల్లువెత్తుతున్న ఫోన్ కాల్స్ తో పరేషాన్
రాహుల్ సమావేశం ముగిసిన వెంటనే దేశం నలువూలలనుంచి ఫోన్ కాల్స్ వెల్లువెత్తాయి. ఈ పరినామంతో తీవ్ర ఆందోళనకు గురైన ఆన ‘గత 15 ఏళ్లుగా నేను ఇదే నంబరు వాడుతున్నాను. రాహుల్ గాంధీ నా నంబర్ చెప్పడం విని షాక్ కు గురయ్యాను. ఓటరు పేరు తొలగింపు కోసం నేనెప్పుడూ దరఖాస్తు చేయలేదు. అసలు నా నంబరు ఆయన దగ్గరకి ఎలా వెళ్లిందో అర్థం కావడం లేదు’ అని అంజనీమిశ్రా ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిరంతరాయంగా వస్తున్న కాల్స్ తో తన ప్రశాంతత దెబ్బతిన్నదని, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు.
రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో ఏం జరిగింది?
ఓ సామాన్యుడి మొబైల్ నంబర్ పొరపాటున బహిర్గతమవడంతో అతనికి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి.
ఆ వ్యక్తి ఎవరు?
సాధారణ పౌరుడు, మీడియా సమావేశానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి.
Read hindi news: hindi.vaartha.com
Read also: