భారతీయ సైన్యంపై రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యల కేసులో ఇవాళ సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. 2022 భారత్ జోడో యాత్రలో ఆర్మీపై రాహుల్ (Rahul Gandhi) అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ కేసులో చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విచారణను నిలిపివేయాలని డిసెంబర్ 4వ తేదీ వరకు సుప్రీంకోర్టు స్టేను పొడిగించింది. జస్టిస్ ఎంఎం సుందరేశ్, సతీశ్ చంద్ర శర్మతో కూడిన ధర్మాసనం ఈ కేసును ఇవాళ విచారించింది. ట్రయల్ కోర్టు ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ మే 29వ తేదీన అలహాబాద్ హైకోర్టును రాహుల్ ఆశ్రయించారు. అయితే ఆ సవాల్‌ను హైకోర్టు తిరస్కరించింది. దీంతో రాహుల్ గాంధీ సుప్రీంను ఆశ్రయించారు.
Read Also : http://Pending bills: రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం పై సుప్రీం సంచలన తీర్పు

సరిహద్దులను చైనా ఆక్రమించినట్లు గతంలో రాహుల్ ఆరోపించారు. అయితే ఆ కేసులో ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు విచారణ చేస్తూ.. 2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న భారత భూభాగాన్ని చైనా ఆక్రమించినట్లు ఎలా చెబుతున్నారని ప్రశ్నించింది. ఆ ఆక్రమణ సమయంలో మీరున్నారా, మీ దగ్గర ఏదైనా నమ్మదగ్గ సమాచారం ఉందా అని కోర్టు అడిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండానే ఎందుకు ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నారని కోర్టు ప్రశ్నించింది. కాంగ్రెస్ నేత తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: