రాహుల్ గాంధీ ఆరోపణలపై సుప్రీంకోర్టు స్పష్టత
కాంగ్రెస్(congress) నేత రాహుల్ గాంధీ చేసిన “ఓటు చోరీ” ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరపాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు (Rahul gandhi) సోమవారం తిరస్కరించింది. ఇది రాజకీయ అంశమని, ఇలాంటి విషయాలను కోర్టు పరిధిలోకి తేవడం సముచితం కాదని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్చిలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ నేపథ్యంలో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) కోర్టు కొట్టివేసింది.
Read also: పండుగకు ముందే చర్మం మెరిసే 5 అద్భుత చిట్కాలు

‘ఓటు చోరీ’ వ్యాఖ్యల నేపథ్యం
ఇటీవల రాహుల్ గాంధీ “ఓటర్ అధికార్ యాత్ర”లో మాట్లాడుతూ బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు చేశారు. “ఓటు చోర్ – గద్దీ ఛోడ్” నినాదంతో, ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రజల ఓట్లను దొంగిలించి అధికారంలోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల్లో బీజేపీ, ఈసీ కలసి ఓటర్ల హక్కులను దోచుకున్నారని అన్నారు. బీహార్ ఎన్నికల్లో కూడా ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా కాపాడతామని రాహుల్ తెలిపారు.
ఈ వ్యాఖ్యలపై ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో (Rahul gandhi) పిటిషన్ దాఖలు చేసి, సిట్ విచారణ జరపాలని కోరాడు. అయితే ధర్మాసనం, “ఇలాంటి రాజకీయ స్వరూపం ఉన్న అంశాల కోసం కోర్టులను వేదికగా ఉపయోగించవద్దు. మీ అభ్యంతరాలను ఎన్నికల సంఘం వంటి సంస్థల వద్ద ఉంచండి” అని సూచించింది. కాగా, రాహుల్ చేసిన ఆరోపణలను బీజేపీ నేతలు, ఈసీ అధికారులు అప్పుడే ఖండించిన విషయం తెలిసిందే.