రాబర్ట్ వద్రాపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఆయన ప్రకటనలో కేంద్ర ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వద్రాను రాజకీయ పరిభాషలో వేధిస్తున్నదని (Harassment)ఆరోపించారు. హర్యానాలోని శికోపూర్‌లో జరిగిన భూ లావాదేవీల కేసులో రాబర్ట్ వద్రాపై గురువారం ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఎటువంటి దర్యాప్తునైనా ఎదుర్కోవడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తన సోదరి ప్రియాంకా గాంధీతో పాటు ఆమె కుటుంబం ఆ విచారణను ఎదుర్కొంటుందన్నారు. పదేళ్లుగా రాబర్ట్ వద్రాను వెంటాడుతున్నారని, దానిలో భాగంగానే తాజాగా ఛార్జ్‌షీట్ దాఖలు చేసినట్లు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. రాజకీయ కక్షతో కూడిన వేధింపులు జరుగుతున్నాయని, ఈ సమయంలో తాను రాబర్ట్, ప్రియాంకా, వారి పిల్లలకు అండగా నిలుస్తున్నట్లు రాహుల్ గాంధీ (Rahul Gandhi)తెలిపారు. సత్యం ఎప్పటికీ వర్ధిల్లుతుందని కాంగ్రెస్ నేత పేర్కొన్నారు.

అప్రతిష్టపాలు చేసేందుకే ..
గాంధీ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే మోదీ సర్కారు తప్పుడు ఆరోపణలు చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత , రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ తెలిపారు. వద్రాకు వ్యతిరేకంగా ఎటువంటి ఆధారాలు లేవని, వందలాది గంటల ప్రశ్నించినా ఫలితం లేదని, కానీ ప్రభుత్వం మాత్రం మళ్లీ మళ్లీ అదే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతో చేస్తున్న ఆరోపణలను ధైర్యంగా ఎదుర్కోనున్నట్లు ఆయన చెప్పారు. ఏదో ఒక రోజు నిజం బయటకు వస్తుందని ఆయన అన్నారు. శికోపూర్‌లో ఉన్న 3 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం వద్రాకు 7 కోట్లకు అమ్మింది. కానీ ఆ తర్వాత స్వల్ప వ్యవధిలోనే వద్రా కంపెనీ అదే భూమిని 58 కోట్లకు అమ్ముకున్నది. భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ జీవిత చరిత్ర?
రాహుల్ గాంధీ 19 జూన్ 1970న పంజాబ్ ప్రాంతంలో జన్మించారు. రాజీవ్ గాంధీ మరియు సోనియా గాంధీ దంపతుల ఇద్దరు పిల్లలలో ఆయన మొదటి సంతానం. ఆయన కుటుంబం భారత రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉండటంలో ప్రసిద్ధి చెందింది. ఆయన తండ్రి తరువాత భారత ప్రధానమంత్రి అయ్యారు.
సోనియా గాంధీ మతం?
ఆమె 2019లో తాత్కాలిక అధ్యక్షురాలిగా తిరిగి ఆ పదవికి చేరుకుని, మరో మూడు సంవత్సరాలు అధ్యక్షురాలిగా కొనసాగారు. ఇటలీలోని విసెంజా సమీపంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన గాంధీ రోమన్ కాథలిక్ కుటుంబంలో పెరిగారు.
వరుణ్ గాంధీ ఎందుకు కాంగ్రెస్ పార్టీని వీడారు?
2021 అక్టోబర్‌లో ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ కేరి జిల్లాలో రైతు నిరసనకారుల హత్యను విమర్శిస్తూ చేసిన ట్వీట్ తర్వాత ఇది ప్రారంభమైంది, దీనికి పార్టీ రాజకీయ నాయకుడితో సంబంధం ఉందని భావించవచ్చు. దీని ఫలితంగా ఆయన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీ నుండి తొలగించబడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bhupesh Baghel: లిక్కర్ స్కామ్.. మాజీ సీఎం భూపేశ్ భగేల్ ఇంట్లో ఈడీ