కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తాజాగా పూర్తిగా మారిన లుక్‌తో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. 55 ఏళ్ల వయసులోనూ ఆయన 35 సంవత్సరాల యువకుడిలా కనిపిస్తున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా విడుదలైన ఫోటోల్లో రాహుల్ గాంధీ చాలా సన్నబడిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఆయన ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.
15 కేజీల బరువు తగ్గిన రాహుల్
విశ్వసనీయ సమాచారం ప్రకారం రాహుల్ గాంధీ సుమారు 15 కేజీల వరకూ బరువు తగ్గారు. ఈ మార్పు కారణంగా ఆయనను చూసిన పార్టీ నేతలు, అభిమానులు మొదట తొలుత షాక్‌కు గురయ్యారని తెలుస్తోంది. కొందరు ఆయన ఆరోగ్య సమస్యల కారణంగా బరువు తగ్గారా అనే అనుమానాలు వ్యక్తం చేయగా, వాస్తవానికి ఇది పూర్తిగా నియమిత డైట్, వ్యాయామం ఫలితంగా వచ్చిందని ఆయన సన్నిహితులు తెలిపారు.
డైట్, ఫిట్‌నెస్‌పై దృష్టి
బరువు తగ్గడానికి రాహుల్ గాంధీ ప్రత్యేకమైన డైట్ పాటిస్తున్నట్లు సమాచారం. ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెట్టడమే ఆయన లుక్‌లో ఈ భారీ మార్పుకు కారణమని చెబుతున్నారు. తాజా రూపంలో రాహుల్ గాంధీ మరింత యంగ్‌గా కనిపించడంతో ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మార్పుతో రాజకీయ కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా కనిపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Read Also : Secretariat Employees : ఏపీ సెక్రటేరియట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్