జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు మరింత సౌకర్యం కల్పించేందుకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) వినూత్న నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రాజెక్టుల వివరాలు, అత్యవసర సేవల సమాచారం, సమీపంలోని ముఖ్యమైన సౌకర్యాలు వాహనదారులకు తక్షణమే అందుబాటులోకి రావడానికి రోడ్ల పొడవునా క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నారు. వీటిని ప్రత్యేకంగా సైన్ బోర్డులపై అమర్చుతారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వెంటనే సంబంధిత ప్రాంతానికి సంబంధించిన సమాచారం మొబైల్‌లో ప్రత్యక్షమవుతుంది.
Today Rasiphalalu: రాశి ఫలాలు – 04 అక్టోబర్ 2025 Horoscope in Telugu
ఈ క్యూఆర్ కోడ్‌లను (Qr Code) స్కాన్ చేస్తే రోడ్ ప్రాజెక్టు వివరాలు, టోల్ ప్లాజా వరకు ఉన్న దూరం, సమీపంలోని ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు, రెస్టారెంట్లు, పంక్చర్ రిపేర్ షాపులు, వాహన సర్వీస్ సెంటర్లు, ఛార్జింగ్ స్టేషన్లు వంటి అన్ని ముఖ్యమైన సమాచారాన్ని వాహనదారులు తెలుసుకోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన ఫోన్ నంబర్లు కూడా ఈ కోడ్ ద్వారా అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణికులు, ముఖ్యంగా అపరిచిత ప్రాంతాలకు వెళ్ళే వారు, సురక్షితంగా మరియు సౌకర్యవంతంగా ప్రయాణం కొనసాగించగలరు.

ఈ క్యూఆర్ కోడ్ వ్యవస్థ వాహనదారులకు మాత్రమే కాదు, రహదారి నిర్వహణకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రజలు నేరుగా NHAI ఆఫీసుల వివరాలు తెలుసుకుని ఫిర్యాదులు, సూచనలు ఇవ్వగలరు. రహదారులపై జరిగే అత్యవసర పరిణామాలపై స్పందన వేగవంతం అవుతుంది. ఈ సాంకేతికత వల్ల రహదారి వాడకంలో పారదర్శకత, భద్రత, సౌకర్యం పెరుగుతాయి. భవిష్యత్తులో ఈ విధానం అన్ని జాతీయ రహదారులపై అమలు చేస్తే దేశంలోని రవాణా వ్యవస్థ మరింత ఆధునికతను సంతరించుకుంటుంది.