నూతనంగా ప్రారంభించిన ఓ జూపార్క్ లో దుప్పులను కుక్కలు చంపేశాయి. కేరళలో ఈ దారుణం జరిగింది. కేరళలోని (Kerala) త్రిసూర్ లో నూతనంగా ప్రారంభమైన పుతూర్ జూపార్కులో వీధి కుక్కలు వేటాడు 10 దుప్పులను చంపేశాయి. దుప్పుల మృతితో అటవీశాఖకు చెందిన అధికారులు జూ పార్క్ లో తనిఖీలు చేశారు.
Read Also: Mahesh Babu: తండ్రిని తలచుకొని మహేశ్ ఎమోషనల్

పోస్టుమార్టం తర్వాతే కారణాలు తెలుస్తాయి
కాగా దుప్పుల కళేబరాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మాత్రమే వాటి మరణానికి కచ్చితమైన కారణాలను చెప్పగలమని అన్నారు. కాగా పుతూర్ జూపార్కు సందర్శన కోసం ప్రజలకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ప్రస్తుతం కేవలం స్కూళ్లు, కాలేజీల గ్రూపులకు మాత్రమే అనుమతి ఇస్తున్నారు.
అయితే ప్రజా సందర్శనకు అనుమతించే తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ జూ దేశంలోనే రెండో అతిపెద్ద జూగా గుర్తింపు పొందింది. అక్టోబర్ 28న ఈ పార్కును రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. మొత్తం 80జాతులకు చెందిన 534 జంతువులకు ఆవాసం కల్పించేలా ఈ జూను డిజైన్ చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: