India Russia summit : జరగనున్న 23వ భారత్–రష్యా వార్షిక సదస్సులో ఆయన పాల్గొననున్నారు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. గత ఏడాది ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ మాస్కోకి వెళ్లారు.
ఈ పర్యటన భారత–రష్యా సంబంధాలను సమీక్షించుకోవడానికి, “ప్రత్యేక మరియు విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (Special & Privileged Strategic Partnership)” మరింత బలోపేతం చేయడానికి కీలక అవకాశం అవుతుందని MEA తెలిపింది. అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై కూడా ఇరుదేశాల నేతలు అభిప్రాయాలు పంచుకోనున్నారు.
సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, అధ్యక్షుడు పుతిన్ మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. వీటిలో ముఖ్యంగా రక్షణ, ఇంధనం, (India Russia summit) వాణిజ్యం, ద్వైపాక్షిక సహకారం అంశాలు ప్రాధాన్యంగా ఉండనున్నాయి.
రష్యా క్రెమ్లిన్ విడుదల చేసిన ప్రకటనలో కూడా ఈ పర్యటనకు అత్యంత ప్రాధాన్యత ఉందని పేర్కొంది. రాజకీయ, వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక, సాంస్కృతిక మరియు మానవతా రంగాల్లో ఉన్న విస్తృత సహకారంపై సమగ్ర చర్చలు జరగనున్నాయని తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షుడు పుతిన్‌ను అధికారికంగా స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు ఏర్పాటు చేయనున్నారు.
పుతిన్ చివరిసారి 2021 డిసెంబర్‌లో భారత్‌కు వచ్చారు. ఆ తరువాతే 2022 ఫిబ్రవరిలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైంది.
Latest news: Amaravati: అమరావతికి మరో 16వేల ఎకరాలు.. క్యాబినెట్ ఆమోదం
రక్షణ & ఇంధన అంశాలు
రష్యా నుంచి అదనపు S-400 గగన రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఆపరేషన్ సిండూర్ సమయంలో ఈ క్షిపణి వ్యవస్థలు అత్యంత ప్రభావవంతంగా పని చేశాయని అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే మూడు స్క్వాడ్రన్లు భారత్‌కు చేరుకోగా, మిగిలిన రెండు వచ్చే ఏడాది మధ్యలో అందనున్నట్లు అంచనా. అయితే ఆలస్యాలపై రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పుతిన్ పర్యటన సందర్భంగా ఈ ఆలస్యాలపై స్పష్టత కోరనున్నట్లు తెలిపారు.
అదే విధంగా సుఖోయ్ విమానాల అప్‌గ్రేడ్ వంటి ఇతర రక్షణ ప్రాజెక్టుల ఆలస్యాలను కూడా భారత్ ప్రస్తావించనుంది. అవసరమైతే Su-57 యుద్ధ విమానాల కొనుగోలుపై కూడా చర్చలు జరగవచ్చు.
ఇంధన రంగంలో భాగంగా, అమెరికా ఆంక్షల తర్వాత భారతదేశం రష్యన్ చమురు కొనుగోలు కొంత తగ్గడంతో, అదనపు డిస్కౌంట్లు ఇవ్వడానికి రష్యా సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
ఉక్రెయిన్ యుద్ధం
ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారం అవసరమని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు వెల్లడించారు. ఇటీవలి కాలంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఉక్రెయిన్ విదేశాంగ మంత్రితో మాట్లాడి దీనిపై చర్చించారు.
భారత్ త్వరితగతిన ఈ యుద్ధానికి ముగింపు రావాలని, శాశ్వత శాంతి నెలకొనాలని కోరుకుంటోందని మరోసారి స్పష్టం చేసింది.
భారత్ విదేశాంగ విధానంలో రష్యా ఎప్పటికీ కీలక భాగస్వామి అని అధికారులు పేర్కొంటున్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/