हिन्दी | Epaper

Pushkar Singh Dhami: సొంత పొలంలోనే దుక్కి దున్నిన ఉత్తరాఖండ్ సీఎం

Sharanya
Pushkar Singh Dhami: సొంత పొలంలోనే దుక్కి దున్నిన ఉత్తరాఖండ్ సీఎం

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) తాజాగా రైతు పాత్రలో ప్రత్యక్షమవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా అధికారిక సమావేశాలు, సమీక్షలు, పాలనాపరమైన తీర్మానాలతో నిత్యం బిజీగా ఉండే ఓ ముఖ్యమంత్రి, అలా నాగలి పట్టి పొలంలోకి దిగితే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. అదే చేశారు సీఎం ధామి. కాళ్ళకు మట్టికాపి, కుడిచేతితో నాగలి పట్టి, కాడెద్దుల మధ్య మట్టిలో నడిచారు. ఇది ఆయన శ్రమకు విలువనిచ్చే వ్యవసాయంపై ప్రేమను వెల్లడించడమే కాదు, రైతులకు మద్దతుగా నిలిచిన ప్రామాణిక ఉదాహరణ కూడా.

సంప్రదాయ పద్ధతులకే మొగ్గు

ఉత్తరాఖండ్‌లోని ధామి స్వగ్రామంలో జరిగింది. ముఖ్యమంత్రి ధామి (Pushkar Singh Dhami) తన సొంత పొలంలో సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయ పనులు చేపట్టారు. కాడెద్దులతో నాగలి పట్టి పొలాన్ని దుక్కి దున్నారు (plowing the field).

వరి నాట్లు – ప్రజలతో కలిసి

పొలం దుక్కిన తర్వాత, అక్కడున్న స్థానిక రైతులతో కలిసిపోయి ఉత్సాహంగా వరి నాట్లు (Paddy fields) వేశారు. సీఎం సామాన్యుడిలా వ్యవసాయ పనుల్లో నిమగ్నమవ్వడంతో ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భారీ వర్షాలు – వ్యవసాయానికి ఆశా కిరణం

ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా వ్యవసాయ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. రైతులంతా వరి నాట్లు వేసే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయంలో రైతులకు భరోసా కల్పిస్తూ వారిలో ఒకరిగా సీఎం ధామి పొలం పనుల్లో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే, మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండటం, వరదలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.

Read also: Pet dog : పెంపుడు కుక్కల పెంపకంపై సూరత్‌లో కఠిన ఆంక్షలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

ఎల్పీజీ కొరతతో ముంబయిలో 20 శాతం హోటళ్ల మూత

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి
0:12

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు కార్మికుల మృతి

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

గ్యాస్ ధరల షాక్, ఇండక్షన్ కుక్కర్లకు భారీ డిమాండ్

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శలు, భార్యపై వ్యాఖ్యల దుమారం

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

సివిల్స్ 301వ ర్యాంకు వివాదం, యూపీఎస్సీ క్లారిటీ

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గోల్డ్ రేట్లు తగ్గుదల, ఈరోజు 24K, 22K ధరలు ఇవే

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

📢 For Advertisement Booking: 98481 12870