Breaking News : గత నెలరోజులుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, గోవా, ముంబాయి, రెండు తెలుగు రాష్ట్రాలు, పంజాబ్ వంటి రాష్ట్రాలలో ఎడతెరపీ లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. (Breaking News) ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుండడంతో గేట్లను ఎత్తివేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పలు గ్రామాలు నీటి మునిగాయి. ప్రత్యేకంగా అధిక వర్షాలతో పంజాబ్ రాష్ట్రం అల్లకల్లోలంగా మారింది. ఊహించని విపత్తు కారణంగా ఇప్పటివరకు అనేకులు మరణించారు.
సెప్టెంబరు 7వరకు విద్యాసంస్థలు బంద్
పంజాబ్ లోని పఠాన్ కోట్, గురుదాస్పూర్, ఫిరోజ్పర్, కపుర్తలా, అమృత్సర్, తర తరణ్, హోషియార్పూర్, రూపనగర్, బర్నాలా వంటి జిల్లాలు వరదలకు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. మళ్లీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలు జారీ అయ్యాయి. దీంతో పంజాబ్లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, పాలిటెక్నిక్ కళాశాలలకు ఈనెల 7వ తేదీ వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
నీటమునిగిన 1,400 గ్రామాలు
భారీ వరదల కారణంగా దాదాపు 1,400 గ్రామాలు నీట మునిగాయి. 3.5 లక్షల మందికి పైగా ప్రజలు ఈ వరదల కారణంగా ప్రభావితమయ్యారు. ముంచుకొచ్చిన ఈ విపత్తు కారణంగా ఇప్పటివరకు 30మందికి పైగా మరణించినట్లు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు సీఎం భగవంత్ మాన్ స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మోడీ సాయం ప్యాకేజీ చేయాలని రాహుల్ డిమాండ్ అనుకోని ప్రకృతి బీభత్సంతో పంజాబ్ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, ప్రధాని మోదీ వెంటనే ప్రజలకు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాగా గత కొంతకాలంగా పంజాబ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ రాష్ట్రం నీటిలో ఎలా మునిగిపోయిందో పలు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చెల్ చేస్తున్నాయి.
Read also :