పంజాబ్ ముఖ్యమంత్రి (Chief Minister of Punjab)భగవంత్ మాన్ ఇటీవల లుధియానాలో జరిగిన “సింధూరం పంపిణీ” కార్యక్రమంపై వ్యాఖ్యానిస్తూ, బీజేపీపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “బీజేపీ ఇప్పుడు ‘వన్ నేషన్, వన్ హజ్‌బెండ్’ (One Nation, One Husband) పథకాన్ని ప్రారంభించిందా?” అని ప్రశ్నించారు.

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బీజేపీ నేతలు సింధూరాన్ని పంపిణీ చేస్తున్నారు. లుథియానాలో జరిగిన ఆ పంపిణీ కార్యక్రమాన్ని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సింగ్ (Bhagwant Man Singh)తప్పుపట్టారు. బీజేపీ ఇప్పుడేమైనా ఒకే దేశం, ఒకే భర్త(వన్ నేషన్ వన్ హజ్‌బెండ్)స్కీమ్‌ను ప్రారంభించిందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం మాన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
వేడెక్కిస్తున్న రాజకీయ వాతావరణం
ఈ వివాదం పంజాబ్ రాజకీయాల్లో ఉత్కంఠను రేకెత్తించింది. భగవంత్ మాన్ వ్యాఖ్యలు మరియు బీజేపీ ప్రతిస్పందనలు రెండు పార్టీలు మధ్య రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తున్నాయి.
లుథియానా వెస్ట్ సీటు కోసం త్వరలో ఉప ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బీజేపీ ప్రచారం నిర్వహిస్తోంది. జూన్ 19వ తేదీన ఆ ఎన్నిక జరగాల్సి ఉంది. ఒకవేళ బీజేపీ వాళ్లు సింధూరాన్ని పంపిణీ చేస్తే, మోదీ పంపిన సింధూరం పెట్టుకోవాలని భార్యను భర్త అడుగుతాడని, అంటే బీజేపీ ఏమైనా వన్ నేషన్ వన్ హజ్‌బెండ్ స్కీమ్‌ను ప్రారంభించిందా అని సీఎం మాన్ ప్రశ్నించారు.
సిగ్గుచేటు
సీఎం మాన్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు తప్పుపట్టారు. ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ నేత ప్రీత్‌పాల్ సింగ్ భలియావాల్ పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్‌ను ఆయన విమర్శిస్తున్నారన్నారు. ప్రతి ఇంటికి బీజేపీ సింధూరాన్ని పంచడం లేదని, ఉగ్రవాదులు మతం అడిగి మరీ హిందువులను చంపారని, అందుకే సింధూరం పేరు పెట్టారన్నారు. ఇండియన్ ఆర్మీని కించపరుస్తున్నారన్నారు. వీర నారీలను అవమానిస్తున్నారని తెలిపారు. పవిత్రమైన గుర్తులపై జోక్ చేయడం అలవాటైనవారికి సింధూరం విలువ తెలియదన్నారు. త్యాగం, ప్రేమ, భక్తికి ఆ సింధూరం సంకేతంగా నిలుస్తుందన్నారు.
Read Also :Chikkaballapur Molvi: మసీదు ప్రాంగణంలో ఆరేళ్ల బాలికపై అఘాయిత్యం