Suicide: హైదరాబాద్: మహారాష్ట్రలోని పూణేలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సహచర ఉద్యోగులతో పాటు సమావేశానికి వచ్చి ఉన్నట్లుండి ఏడంతస్తుల భవనం నుంచి దూకి ఆత్మహత్యకు (Suicide) పాల్పడ్డాడు. వివరాలు ఇలా వున్నాయి. మహా రాష్ట్ర (Maha Rastra) లోని నాసిక్కు చెందిన పీయూష్ అశోక్ కవాడే (23) ఇటీవలో పూణేలోని హింజేవాడిలో గల ఐటి పార్కు వద్ద వున్న ఓ కంపెనీలో సాఫ్ట్ వేర్ గా ఇంజనీర్ చేరాడు. ఎప్పటిలాగే సోమవారం ఉదయం పది గంటల సమయంలో విధులకు వచ్చిన పీయూష్ (Piyush) సహచర ఉద్యోగులతో కలిసి కంపెనీ సమావేశానికి వచ్చాడు. సమావేశం జరుగుతుండగానే తనకు ఆరోగ్యం బాగాలేదని బయటకు వచ్చిన పీయూష్ వెంటనే భవనం పైకి ఏడో అంతస్తు వద్దకు వచ్చాడు. అనంతరం అందరు చూస్తుండగానే ఒక్కసారిగా కిందకు దూకాడు. ఈ ఘటనలో పీయూష్ తలతో పాటు శరీరంలోని పలుచోట్ల తీవ్రంగా గాయాలు తగలడంతో ఘ టనా స్థలిలోనే చనిపోయాడు. ఇతని ప్యాంట్ జేబులో ఒక లేఖ లభించింది. ఇందులో తాను జీవితంలో విఫలమయ్యానని, తనను క్షమించమని వుంది. మీకు కుమారుడిగా వుండేందుకు అర్హుడిని కాను అని తన తల్లిదండ్రులకు రాసిన లేఖలో వుంది. కాగా ఈ ఘటన తరువాత పీయూష్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చూరీకి తరలించారు, దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేబట్టారు.
పీయూష్ ఆత్మహత్యకు ముందు ఏం చేశాడు?
కంపెనీ సమావేశం మధ్యలో ఆరోగ్యం బాగాలేదని చెప్పి బయటకు వెళ్లి, ఏడో అంతస్తు పైకి వెళ్లి దూకాడు.
పీయూష్ జేబులో లభించిన లేఖలో ఏముంది?
తన జీవితంలో విఫలమయ్యానని, తల్లిదండ్రులను క్షమించాలంటూ, తాను కుమారుడిగా అర్హుడు కాదని రాశాడు.
Read Hindi News : hindi.vaartha.com
Read also: Boyfriend kidnap: బాయ్ ఫ్రెండ్‌ను కిడ్నాప్ చేసి 2.5 కోట్లు డిమాండ్