हिन्दी | Epaper

Telugu News: Priyanka Gandhi: ఎన్డీయే కీలక హామీపై ప్రియాంక గాంధీ విమర్శలు

Sushmitha
Telugu News: Priyanka Gandhi: ఎన్డీయే కీలక హామీపై ప్రియాంక గాంధీ విమర్శలు

పాట్నా: రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly elections) ‘ఇండియా’ కూటమి విజయం సాధిస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు పాట్నా విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన ఆమె, ఎన్డీయే కూటమి ఇచ్చిన కోటి ఉద్యోగాల వాగ్దానాన్ని అమలు చేయలేదని తీవ్రంగా విమర్శించారు. ఇన్నేళ్లు అధికారంలో ఉండి ఎందుకు హామీలను నెరవేర్చలేదని ఆమె బీజేపీ, జేడీయూలను నిలదీశారు.

Read Also: NTR District: అయ్యప్ప మాల వేసుకున్న విద్యార్థి.. స్కూల్ లోకి అనుమతించని యాజమాన్యం

Priyanka Gandhi
Priyanka Gandhi

తొలి ప్రచార సభలో విమర్శలు

బెగుసరాయ్‌లో తన తొలి ప్రచార సభలో ప్రియాంక గాంధీ మాట్లాడుతూ, ఎన్నికల్లో గెలుపొందేందుకు ఎన్డీయే ప్రభుత్వం విభజన రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. బీజేపీ నకిలీ జాతీయవాదాన్ని ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించలేక ఓట్ల చోరీకి పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఓట్ల తొలగింపు అనేది హక్కుల ఉల్లంఘనతో సమానం అని ఆమె వ్యాఖ్యానించారు.

డబుల్ ఇంజిన్ ప్రభుత్వంపై వ్యాఖ్యలు

దేశాభివృద్ధికి బీహార్(Bihar) ఎంతో తోడ్పడిందని, కానీ రాష్ట్రాభివృద్ధి విషయంలో మాత్రం వెనుకబడి ఉందని ఆమె అన్నారు. బీజేపీ నాయకులు నిత్యం గతం, భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నారని, ప్రస్తుతం గురించి మాత్రం మాట్లాడటం లేదని విమర్శించారు. నెహ్రూ, ఇందిరాగాంధీలను విమర్శిస్తున్నారే తప్ప నిరుద్యోగం, వలసల గురించి పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. బీహార్‌లో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం లేదని, ప్రతిదీ ఢిల్లీ నుంచి నియంత్రిస్తారని ప్రియాంక గాంధీ విమర్శించారు. ఎన్డీయే పాలనలో పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతోందని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రధాని నరేంద్ర మోదీ కొద్దిమందికే అప్పగించారని ఆమె ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

పెళ్లైన నెలకే భర్తను చంపిన భార్య

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

జేకేసీఏ స్కామ్ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

గ్యాస్ కొరత భయం, ఆన్‌లైన్‌లో ఇండక్షన్ స్టవ్‌లు ఔట్ ఆఫ్ స్టాక్!

No image

దేశంలో ఇంధన సంక్షోభం ముంచుకొస్తోందని – రాహుల్ గాంధీ హెచ్చరించారు.

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

గ్యాస్ కొరతతో దేశం అల్లాడుతోంది రాహుల్ గాంధీ

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

కర్ణాటకలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయా?

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

ఎల్పీజీ కొరతపై కేంద్రానికి రాహుల్ గాంధీ సూచన

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

సభలో ఎవరికీ ప్రత్యేక వెసులుబాట్లు ఉండవు : స్పీకర్‌ ఓంబిర్లా

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

గ్యాస్ బుక్ చేశారా? 2 రోజుల్లో రాకపోతే ఈ నెంబర్లకు కాల్ చేయండి!

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

స్వచ్ఛమైన ‘మంచినీరు’ మనకు లభించదా?

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డుల పుకార్లను నమ్మకండి!

📢 For Advertisement Booking: 98481 12870